1 July, 2026 | 7:34 PM

Breaking News

విజయ క్రాంతి వార్తకు స్పందన మొలకెత్తని సోయాబీన్ పొలాలను పరిశీలించిన అధికారులు   •   డిబిఎమ్ 6 కాల్వకు గండి   •   ఓస్ట్‌ఫాలియా యూనివర్సిటీతో శాతవాహన అవగాహన ఒప్పందం   •   సీఎం పర్యటన ఏర్పాట్లపై ఎస్పి తనిఖీ   •   అమలు కానీ హామీలతో ప్రజల చెవిలో పూలుపెట్టిన రేవంత్ ప్రభుత్వం   •   ఆర్టీసీ కార్గోను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమమే: సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్   •   కృత్రిమ మేధతో కొత్త పుంతలు తొక్కుతున్న వైద్యం   •   విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది : జిల్లా కలెక్టర్ కె.హరిత   •   ప్రైవేటు పాఠశాలలో పుస్తక దోపిడిని అరికట్టాలి: ఏబీవీపీ   •   బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •  

హారర్ కామెడీ భవనమ్

31-07-2024 12:05 AM

ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిలిమ్స్ మరో క్రేజీ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సంస్థ తాజాగా నిర్మిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘భవనమ్’. దీనికి బాలాచారి కూరెళ్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్‌బీ చౌదరి, వాకాడ అంజన్‌కుమార్, వీరేంద్ర సీర్వి నిర్మాతలు. సప్తగిరి, ధనరాజ్, షకలక శంకర్, అజయ్, మాళవిక సతీశన్, స్నేహా ఉల్లాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది.

ఈ కార్యక్రమంలో హీరో సప్తగిరి మాట్లాడుతూ.. సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థ తమ 95వ చిత్రంగా ఇంత మంది కమెడియన్స్‌తో తొలిసారి హారర్ కామెడీని రూపొందిస్తోంది. ఈ సంస్థలో పనిచేయాలనే కోరిక ‘భవనమ్’తో నెరవేరింది. ఆగస్టు 9న  విడుదల కానున్న ఈ సినిమాను థియేటర్లలో చూసి మమ్మల్ని ప్రోత్సహించాలని ప్రేక్షకులను కోరుకుంటున్నా” అన్నారు. ఇంకా ఈ ఈవెంట్‌లో మాట్లాడిన హీరో షకలక శంకర్, హీరోయిన్ మాళవిక సతీశన్, డైరెక్టర్ చరణ్ అర్జున్, మిగతా చిత్రబృందం, నిర్మాణ బృందం సినిమా విశేషాలను వెల్లడించారు.