calender_icon.png 10 January, 2026 | 12:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

15 సంవత్సరాలుగా ప్రజాసేవలో ఉంటున్నా..

08-01-2026 01:06:47 AM

  1. అవకాశం ఇస్తే ఐదో వార్డు నుంచి కౌన్సిలర్‌గా పోటీ చేస్తా...

కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు సయ్యద్ ఇలియాజ్ అలీ...

బాన్సువాడ, జనవరి 7 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ కేంద్రంలోని 5 వార్డ్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు సయ్యద్ ఇలియాజ్ అలీ గత 15 సంవత్సరాలు గా ప్రజా సేవలో ఉంటూ పోచారం శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి విధేయుడు గా ఉంటూ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్నారు. గత పది సంవత్సరాలుగా సోషల్ మీడియా కన్వీనర్ గా ఉంటూ పార్టీ కోసం పార్టీ సంక్షేమ పథకాలను  సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా ప్రచారం చేస్తూ నియోజక వర్గం స్థాయిలో నే కాకుండా రాష్ట్ర స్థాయిలో సోషల్ మీడియా లో తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందారు.

గతంలో 2013 లోనే అర్ఫత్ కాలనీ నుండి వార్డ్ సభ్యుడుగా పోటీ చేయడం జరిగింది. 2019 లో బాన్సువాడ తొలి మున్సిపాలిటీ ఎన్నికల్లో నామినేషన్ పత్రాలను సమర్పించారు.కానీ పార్టీ ఆదేశానుసారం నామినేషన్ విత్ డ్రా చేసుకొన్నారు.  ఇపుడు మళ్ళీ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో 5 వార్డ్ నుండి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తే పోటీ చేస్తానని ఆయన తెలిపారు. ఉన్నత విద్యా వంతుడు పార్టీలో చురుకైన పాత్ర పోషించి మెప్పించారు. పట్టణ కేంద్రంలో  వార్డ్ లో ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న యువ నాయకులు ఇలియాస్ అలీ.

ప్రభుత్వ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి,ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు,మాజీ డి సి సి బి ఛైర్మెన్ పోచారం భాస్కర్ రెడ్డి లు  కౌన్సిలర్ గా పోటీ చేసేందుకు ఒక అవకాశం కల్పించాలని ఆయన కోరారు. ప్రజాసేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఇలాంటి సమస్యలు ఉన్న పెద్దల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన మనసులో మాట చెప్పారు.