08-01-2026 01:05:22 AM
తాడ్వాయి,జనవరి, 7( విజయ క్రాంతి): గ్రామంలో నూతనంగా నిర్పిస్తున్న కొమురవెల్లి మల్లన్న ఆలయ నిర్మాణంలో భాగంగా ధ్వజస్తంభ నిర్మాణానికి తాను కృషి చేస్తానని బిజెపి నాయకుడు పైడి ఎల్లారెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్ర పహాడు గ్రామంలో బుధవారం ఆయన నూతనంగా నిర్మిస్తున్న కొమరవెల్లి మల్లన్న ఆలయాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడ ఆలయం నిర్మించడం ఆనందంగా ఉందన్నారు ఆలయం ఆవరణలో ధ్వజ స్తంభాన్ని నిర్మించబడడానికి తనవంతు ఏర్పాట్లు చేస్తామన్నారు ఈ సందర్భంగా ఎల్లారెడ్డిని ప్రతినిధులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు