9 August, 2026 | 2:20 AM

అగధతో నాకు ఆ బాక్సాఫీస్ స్టాంప్ వస్తుందని ఆశిస్తున్నా

09-08-2026 12:56 AM

శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కాశీ విశాలాక్షి బలుసు నిర్మాణంలో ఎంఎస్ రాజు తెరకెక్కించిన చిత్రం ‘అగధ’. కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్‌కుమార్, భాను చందర్, షిజు, వనిత విజయ్‌కుమా ర్, రోషన్ బషీర్, శ్రేయారాణి రెడ్డి, వివా రాఘ వ, రాబర్ట్ మాస్ట ర్, ఆర్నా ములే ర్, కనకవ్వ ముఖ్య పాత్రలను పోషించారు. ఈ సినిమాను ఆగస్టు 14న విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలో హీరో శ్రవణ్‌రెడ్డి శనివారం మీడియాతో చిత్ర విశేషాల్ని పంచుకున్నారు. “అగధ’లో నా పాత్ర విభిన్నంగా ఉంటుంది. డైరెక్ట ర్ నా క్యారెక్టర్‌ను చాలా పార్శ్వాలు ఉండేలా డిజైన్ చేశారు. చాలా షేడ్స్ ఉన్న ఈ పాత్రను పోషించడం ఆనందంగా ఉంది.

‘అగధ’ నాకు ఎంతో ఛాలెంజింగ్‌గా, డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చింది. డివైన్ మిస్టిక్ థ్రిల్లర్‌గా ‘అగధ’ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో హారర్, థ్రిల్ మూమెంట్స్ చాలా ఉంటాయి. ఇందులో నెగెటివ్ పాత్రే ఉండదు. పరిస్థితుల వల్లే పాత్రలు అలా ప్రవర్తిస్తుంటాయి. గుడ్ వర్సెస్ బ్యాడ్, గాడ్ వర్సెస్ ఈవిల్ అన్నట్టు సాగుతుంది. నేను గతంలో నటించిన ‘డర్టీ హరి’ ఓటీటీలో సక్సెస్ అయింది. హీరోకి బాక్సాఫీస్ నంబర్లే ముఖ్యం. ‘అగధ’తో నాకు ఆ బాక్సాఫీస్ స్టాంప్ వస్తుందని ఆశిస్తున్నా. ప్రస్తుతం నేను రాజ్ అండ్ డీకే టీమ్‌లో పనిచేసిన చంద్ర దర్శకత్వంలో ఓ మూవీని చేస్తున్నా. ఆల్రెడీ కాశ్మీర్‌లో ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేశాం. కొన్ని ప్రాజెక్టులు చర్చల్లో ఉన్నాయి” అని తెలిపారు.