14 July, 2026 | 10:51 AM

రచ్చకెక్కిన మంచు కుటుంబం.. మంచు మనోజ్‌పై కేసు నమోదు

10-12-2024 11:02 AM

హైదరాబాద్,(విజయక్రాంతి): సినీ నటుడు మంచు మనోజ్, ఆయన భార్య మౌనికపై రాచకొండ కమిషనర్ కు మోహన్ బాబు మంగళవారం ఫిర్యాదు చేశారు. గత కొన్ని రోజులగా మంచు కుటుంబంలో విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. తన చిన్న కోడుకు, కోడలు నుంచి ప్రాణహాని ఉందంటూ వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. మనోజ్, మౌనిక తన ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు ఇద్దరు ప్లాన్ చేశాని, దీంతో సిబ్బందిని బెదిరిస్తున్నారని ఆరోపించారు. తన భద్రత, విలువైన వస్తువులు, ఆస్తుల గురించి తనను భయంగా ఉందని మోహన్ బాబు తెలిపారు.  దీంతో భయం లేకుండా ఇంట్లో గడిపేందుకు రక్షణ కల్పించాలని మోహన్ బాబు ఫిర్యాదు వెల్లడించారు.