31-05-2025 12:00:00 AM
తమిళం నుంచే కన్నడ భాష పుట్టిందంటూ కమల్‌హాసన్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి తెర లేపాయి. కమల్‌హాసన్ హీరోగా నటించిన ‘థగ్‌లైఫ్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గురువారం రాత్రి వైజాగ్‌లో నిర్వహించారు. ఈ వేడుకలో మాట్లాడిన కమల్‌హాసన్ కన్నడ భాషను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కర్ణాటక అధికార, విపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (కేఎఫ్సీసీ) కూడా తీవ్రంగా స్పందించింది.
ఆయన మే 30వ తేదీలోగా క్షమాపణ చెప్పకపోతే ‘థగ్‌లైఫ్’ సినిమాను తమ రాష్ట్రంలో అడ్డుకుంటామని స్పష్టం చేసింది. కమల్ వ్యాఖ్యలపై కేఎఫ్సీసీ అధ్యక్షుడు ఎం నరసింహులు, మాజీ అధ్యక్షుడు గోవిందు, మాజీ అధ్యక్షురాలు, నటి జయమాల కూడా వేర్వేరుగా స్పందించారు. కమల్ వ్యాఖ్యల్లో నిజం లేదని, కన్నడ భాష తమిళం నుంచి పుట్టలేదంటున్న కన్నడిగులు.. ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిందేనని పట్టుపడుతున్నారు.
మరోవైపు కమల్‌హాసన్ తన కామెంట్స్‌పై ఇప్ప టికే వివరణ ఇచ్చారు. అవి ప్రేమతో చేసిన వ్యాఖ్యలని, ప్రేమ ఎన్నడూ క్షమాపణ చెప్పదన్నారు. భాష చరిత్ర గురించి ఎంతోమంది చరిత్రకారులు తనకు చెప్పారని, తన వ్యాఖ్యల్లో మరో ఉద్దేశం లేదన్నారు. భాష గురించి మాట్లాడే అర్హత రాజకీయ నాయకులకు లేదని, ఇది తనకు కూడా వర్తిస్తుంద న్నారు.
దీనిపై చర్చను చరిత్రకారులు, భాషా నిపుణులకు వదిలేద్దామని చెప్పిన ఆయన నేరుగా క్షమాపణ చెప్పేందుకు నిరాకరించారు. ఇదే విషయమై తాజాగా ఓ ఇంట ర్వ్యూలోనూ స్పందించారు కమల్. “నేను ఏ విషయంలోనైనా తప్పు చేస్తేనే క్షమాపణలు చెప్తాను. లేదంటే చెప్పను. అది నా శైలి. భారత్ ప్రజాస్వామ్య దేశం. నేను చట్టాన్ని, న్యాయాన్ని నమ్ముతాను. వాటిని గౌరవిస్తాను. ఈ విషయంలో ప్రజలు జోక్యం చేసుకోవద్దు.