31-05-2025 12:00:00 AM
ఎస్‌ఐఎఫ్‌ఏఏ సంస్థ నిర్మిస్తున్న సినిమా ‘ధర్మచక్రం’. దీని షూటింగ్ పూర్తయినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సం దర్భంగా మూవీ డైరెక్టర్ వెంకటరమణ పసుపులేటి మాట్లాడుతూ.. “ధర్మచక్రం’ సినిమా చంద్రబాబు నాయుడు ఎంతో కష్టపడి, పార్టీ విలువలను కాపాడిన జీవన గాథకు స్ఫూర్తిగా నిలుస్తుంది. ఈ సినిమా ద్వారా ‘నోటు రుచి మరిగిన వారికి పదవులిస్తే ఓటు విలువ తగ్గుతుంది’ అనే సందేశాన్ని ప్రేక్షకులకు అందిస్తున్నాం.
రాముడిని అడవికి పంపించే దాకా మందర నిద్రపోని విధంగా, ఈ సినిమాను ఆపాలని కొందరు ప్రయత్నిస్తున్నప్పటికీ ‘ధర్మచక్రం’ సినిమా సూ పర్ హిట్ అవుతుంది. రాముడు దేవుడయ్యాడు, మందర చరిత్ర హీనమైంది. ఎన్టీ రామారావు జయంతి పురస్కరించుకొని మహానాడు సందర్భంగా ఈ సినిమా ఆడియో విడుదల కావడం సంతోషంగా ఉంది” అన్నారు.