1 September, 2026 | 7:18 PM

స్మార్ట్ కార్డ్ పంపిణీలో బీజేపీ శ్రేణుల నిరసన

01-09-2026 | 06:20pm

సొమ్ము ఒకరిది సోకు మరొకరిది అనే రీతిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీరు

స్మార్ట్ కార్డులు లో ప్రధాని మోడీ ఫోటో పెట్టాలి

కూసుమంచి,(విజయక్రాంతి): బీజేపీ జిల్లా నాయకులు గుండా ఉపేందర్ రెడ్డి, మంద నవ్య చంద్రశేఖర్ గౌడ్ మంగళవారం కూసుమంచి మండల కేంద్రంలో స్మార్ట్ కార్డులు పంపిణీ లో కార్డుల మీద ప్రధాని మోదీ ఫోటో లేకపోవడం వలన నిరసన చేయడం జరిగినది. పేద ప్రజలు ఆకలితో ఆల్మతించకూడదు అని ఎంతో గొప్ప మనసుతో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన పథకం(Pradhan Mantri Garib Kalyan Anna Yojana Scheme) ద్వారా పేద ప్రజలకు ఒక్కరికి రవాణా ఖర్చులతో పాటు ఉచితంగా ఐదు కేజీలు రేషన్ బియ్యం(Ration rice) అందిస్తుంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేవలం ఒక్క కేజీ బియ్యం మాత్రమే అందిస్తూ, తామే మొత్తం ఇస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటూ ప్రచారం చేసుకోవడం అన్యాయం అని, స్మార్ట్ కార్డులు పైన ముఖ్యమంత్రి, మంత్రి ఫోటోలు, పేర్లు తొలగించాలి అని దేశ ప్రధాని నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi) ఫోటో పెట్టాలి అని డిమాండ్ చేయడం జరిగింది. ఇక ప్రతి రేషన్ దుకాణంలో ప్రధాని మోడీ ఫోటోతో రేషన్ బియ్యం పంపిణీ చేయాలి రేషన్ డీలర్ల కు విజ్ఞప్తి చేస్తున్నాము లేకుంటే అట్టి రేషన్ షాపులు పైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలియ చేస్తున్నాము.