వైఫల్యాలకు బాధ్యత నాదే
సీబీఎస్‌ఈ అవతవకలపై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్
న్యూఢిల్లీ, మే 28: సీబీఎస్‌ఈ 12వ తరగతి ఆన్‌స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్‌ఎం) మూల్యాంకన ప్రక్రియలో అవకతవకలు జరిగినట్లు తేలితే ఎవ్వరినీ వదిలిపెట్టబోమని విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హామీ ఇచ్చారు. ఈ వైఫల్యాలకు ‘నేనే బాధ్యత తీసుకుంటున్నా’ అని పేర్కొన్నారు. తప్పిదాలను సరిచేస్తామని, పరిష్కారాలను కనుగొంటామని చెప్పారు. మరోపక్క నీట్ రీటెస్ట్‌పై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాసంలో ఉన్నత స్థాయి సమావేశంలో కేంద్రమంత్రి ధర్మేంద్ర పాల్గొనానరు.
గురువారం ఢిల్లీలో సీబీఎస్‌ఈ అధికారులతో జరిగిన సమావేశం అనంతరం కేంద్రమంత్రి ప్రధాన్ మీడియాతో మాట్లాడా రు. 98 లక్షల సమాధాన పత్రాల కాపీలను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచామన్నారు. ఒక్కో పత్రంలో 40 పేజీలుంటాయని, ఆ లెక్కన 40 కోట్ల కాపీలను స్కాన్ చేశామ న్నారు. ఆన్‌స్క్రీన్ మార్కింగ్ సిస్టమ్ అనేది ఒక ముందడుగుగా పేర్కొన్నారు. ఇప్పటికే అంతర్జాతీయంగా దీన్ని వినియోగిస్తున్నారని తెలిపారు.






