19 April, 2026 | 1:49 AM

మిగిలా నేనొంటరిలా..

19-04-2026 12:03 AM

తరుణ్ భాస్కర్ ఇప్పుడు రైటర్-, డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి చేస్తున్న సినిమా ‘గాయపడ్డ సింహం’. ఈ చిత్రాన్ని కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేశ్ బన్సాల్ నిర్మించారు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలుగా నటించారు. విష్ణు ఓయి, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. మే 1న థియేటర్లలో విడుదల కానున్న ఈ మూవీ ట్రైలర్, ప్రమోషనల్ సాంగ్, బ్రైడ్ సాంగ్ అంచనాలు పెంచాయి.

తాజాగా మేకర్స్ ‘జింగాలా’ సాంగ్ రిలీజ్ చేశారు. గాయపడ్డ సింహం (తరుణ్ భాస్కర్) మనసులో దాగి ఉన్న బాధను, ఆవేశాన్ని, తిరిగి లేచే శక్తిని ఆవిష్కరించే పాట ఇది. ‘అనగనగనగా మనతో కలిసేను పిల్లా.. మందు గ్లాసులో ఐసులా.. అనుకోకుండా మిగిలా నేనొంటరిలా.. చెస్సు బోర్డులో కైన్సులా..’ అంటూ సాగుతోందీ గీతం.

స్వీకర్ అగస్తి సరపర్చిన ఈ పాటను కశ్యప్ శ్రీనివాస్, సునీల్ కరంకంటి, శ్రీని జోస్యు రాయగా, నకాశ్ అజీజ్ ఆలపించారు. ఈ చిత్రానికి విద్యాసాగర్ చింతా సినిమాటోగ్రఫీ, విప్లవ్ నైషదం ఎడిటింగ్‌ను, చంద్రిక గొర్రెపాటి ప్రొడక్షన్ డిజైన్, సూర్య ప్రకాష్ జ్యోసుల కథను అందిస్తున్నారు.