15 June, 2026 | 2:59 PM

Breaking News

తెలంగాణపై కేంద్రం తీవ్రమైన వివక్ష.. కిషన్ రెడ్డిపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు   •   పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •  

యాక్షన్‌తో మొదలెట్టారు!

19-04-2026 12:00 AM

సల్మాన్‌ఖాన్ హీరోగా దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ మరో కీలక దశకు చేరింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్.. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్‌ఖాన్, జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు వంశీ పైడిపల్లిల ఫస్ట్ కొలాబరేషన్ కావడం విశేషం. ఈ కాంబినేషన్ ఇప్పటికే భారీ అంచనాలను సృష్టించగా, షూటింగ్ ప్రారంభంతో ఆ ఆసక్తి మరింత పెరిగింది.

ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ ప్రాజెక్టు ప్రస్తుతం ‘ఎస్‌వీసీ63’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉంది. శనివారం ముంబైలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం, కథానాయికగా నయనతార అధికారికంగా సెట్స్‌లో అడుగుపెట్టారు. ముహూర్తం కార్యక్రమంతోనే నెల రోజులపాటు సాగనున్న భారీ షెడ్యూల్‌ను ప్రారంభించారు మేకర్స్.

ప్రత్యేకంగా నిర్మించిన హ్యూజ్ సెట్‌లో హై-ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాలు, కీలక ఘట్టాలను చిత్రీకరిస్తున్నారు. ఈ కీలక షెడ్యూల్లో నయనతార కూడా ప్రధాన తారాగణంలో చేరారు. పూర్తి తారాగణం, సాంకేతిక బృందం వివరాలను మేకర్స్ త్వరలోనే వెల్లడించనున్నారు. ఈ చిత్రం 2027లో థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.