3 June, 2026 | 1:39 AM

చిరంజీవి తిడతారేమోనని చాలా భయపడ్డా !

03-06-2026 01:01 AM

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ నుంచి వస్తున్న సరికొత్త యాక్షన్ డ్రామా ‘పెద్ది’ దేశవ్యాప్తంగా హ్యూజ్‌బజ్ క్రియేట్ చేస్తోంది. దర్శకుడు బుచ్చిబాబు సానా దీన్ని స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నారు. 

ఈ సినిమా జూన్ 4న విడుదల కానున్న నేపథ్యంలో డైరెక్టర్ బుచ్చిబాబు విలేకరులతో సినిమా విశేషాలు పంచుకున్నారు. 

ఈ సినిమా షూటింగ్‌లో చరణ్‌కు చాలా గాయాలయ్యాయి. ముఖ్యంగా రెజ్లింగ్ సన్నివేశాల్లో దెబ్బలు తగిలాయి. కంటికి గాయం అయ్యి రక్తం కారినప్పుడు మాత్రం చిరంజీవి తిడతారేమో అని నాకు భయమేసింది. అది కెమెరాలో కూడా రికార్డ్ అయింది. ఒక ఫైట్ సీన్‌లో పొరపాటున తగిలింది. అయితే చిరంజీవి ‘బుచ్చి వీడియో పంపించు’ అన్నారు (నవ్వుతూ). 

నా తొలి చిత్రం ‘ఉప్పెన’ తర్వాత చరణ్ దగ్గరకు వెళ్లడానికే నాకు రెండున్నరేళ్లు పట్టింది. ఆయన కథ ఓకే చేసిన తర్వాత ఏడాదిన్నరలో షూటింగ్ పూర్తయ్యింది.  

క్రికెట్ అందరికీ తెలిసిన ఆటే. కుస్తీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. ‘దంగల్’లో అమీర్‌ఖాన్‌కు కోచింగ్ ఇచ్చిన ట్రైనర్‌ను తీసుకొచ్చాం. తెలంగాణ పహెల్వాన్ల దగ్గర రామ్‌చరణ్ ౪ నెలలు శిక్షణ తీసుకున్నారు.  

చాలా మంది ఇది ఎన్టీఆర్ కోసం అనుకున్న కథ అంటున్నారు. కానీ, ఇది పూర్తిగా చరణ్ కోసం తయారు చేసిన కథే. చరణ్‌కు కథ నచ్చింది కాబట్టే ఒప్పుకున్నారు. కథతోనే ఆయనను కన్విన్స్ చేశా. -చరణ్‌కు ఎప్పటినుంచో ఒక స్పోర్ట్స్ డ్రామా చేయాలనే ఆసక్తి ఉంది. ఆయనకు నచ్చేలా ఈ కథ సిద్ధం చేశాం.

ఏ సినిమా సక్సెస్ అయినా ఇండస్ట్రీకి, డైరెక్టర్లకు, హీరోలకు, సినిమాకు పనిచేసిన అందరికీ అవసరమే. అయితే ఇప్పుడు ఆ అవసరం కాస్త గట్టిగా ఉంది. నా కెరీర్ మొత్తం అలానే జరిగింది (నవ్వుతూ). ఉప్పెన రిలీజ్‌కు మూడు రోజుల ముందే 100% ఆక్యుపెన్సీకి అనుమతి వచ్చింది. జనం థియేటర్లకు వచ్చి, పెద్ద హిట్ ఇచ్చారు. 

శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ.. తమ తమ పాత్రలకు పర్‌ఫెక్ట్‌గా సరిపోతారు. శివన్న ఒక గురువుగా కనిపిస్తారు. ఆటను బతికించేవాడి పాత్ర అది. జగపతిబాబు చేసిన ‘అప్పలసూరి’ పాత్ర చాలా బరువైనది. హీరో తర్వాత అంత పవర్‌ఫుల్‌గా ఉండే పాత్ర అది. దివ్యేందు పాత్ర కూడా చాలా క్రేజీగా ఉంటుంది. -జాన్వీ కపూర్ ఈ సినిమాకు ఒక స్పెషల్ కలర్ తీసుకొచ్చారు. లవ్ ట్రాక్‌లో చాలా బాగుంటారు.  

ఈ సినిమాలో ‘అబ్బనీ తీయ ని దెబ్బ’ పాటను రీక్రియేట్ చేయలేదు. అది రేడియోలో మాత్రమే వినిపిస్తుంది. అది వచ్చినప్పుడు ప్రేక్షకులు కథ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందని భావించి దాన్ని మ్యూట్ చేసేశాం. -ఈ సినిమాలో ఇంకా రెండు పాటలున్నాయి. ఆ రెండు కూడా అదిరిపోతాయి.

రెహమాన్.. ‘మస్సా మస్సా’ పాట చేసిన తర్వాత దాదాపు రెండు నెలలు ఎవరికీ వినిపించలేదు. మరో ఆప్షన్ కావాలని అడిగా. ఒకరోజు చరణ్ ఆ పాట విని, ‘అదిరిపోయింది’ అన్నారు. ఫైనల్ అయింది.  

నేను గతంలో ‘పుష్ప’.. ‘పది కేజీఎఫ్‌లతో సమానం’ అన్నా . దాని ప్రకారం చెప్పాలంటే.. -పుష్పరాజ్ మైండ్‌లో ఉంటే, ‘పెద్ది’ గుండెల్లో ఉంటాడు.  

‘పెద్ది’ జర్నీని మూడు దశలుగా విభజించాం. ప్రతి దశకు లుక్ ఎలా ఉండాలో ఏఐలో డిజైన్ చేసి ఆయన దగ్గరకు తీసుకెళ్లా. చరణ్.. నేను డిజైన్ చేసిన దానికంటే ఇంకా అద్భుతంగా ట్రాన్స్ ఫార్మ్ అయ్యారు. మైండ్‌బ్లోయింగ్‌గా అనిపించింది. 

నెక్స్ ప్రాజెక్ట్ గురించి చెప్పాలంటే.. ఒక మంచి కథ సిద్ధం గా ఉంది. ఎవరితో చేస్తాననేది తర్వాత చూద్దాం. -ఎన్టీఆర్ పిలిస్తే మాత్రం పరిగెత్తుకుంటూ వెళ్లి కథ చెప్తా.