27 July, 2026 | 12:05 PM

Breaking News

లిఫ్ట్ మోటార్ల తో నీటిని రిజర్వాయర్ లోకి ఎత్తాలి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్   •   సులానగర్ పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   సిరిసిల్ల జిల్లా గౌడ యువజన సంఘం అధ్యక్షుడిగా సందీప్ గౌడ్.   •   జలపాతాల అందాలను పర్యాటకులు ఆస్వాదించేలా ఏర్పాటు చేయండి   •   బావుసాయిపేట ఇసుక క్వారీ వద్ద రైతుల ఆందోళన   •   దూడను తిన్న చిరుత పులి   •   సోనాల పాఠశాల విద్యార్థులకు శుద్ధ జలం   •   సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై అంజయ్య   •   సనాతన ధర్మ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: చాగంటి కోటేశ్వర రావు   •   మోదీ హామీ ఏమైంది? విద్యార్థులపై కేసులు ఎత్తివేయలేదు   •  

నా మనసు నిను చూసీచూడగానే..

03-06-2026 12:53 AM

వడ్డే క్రియేషన్స్ బ్యానర్‌పై వడ్డే నవీన్ హీరోగా, నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’. కమల్ తేజ నార్ల దర్శకుడు. వడ్డే నవీన్, రాశి సింగ్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం జూన్ 19న రిలీజ్ కానుంది. మేకర్స్ ఈ సినిమా నుంచి ‘నువ్వే కదా..’ అనే రెండో గీతాన్ని ఎఫ్‌ఎం రేడియో స్టేషన్‌లో విడుదల చేశారు. నా మనసు నిను చూసీచూడగానే నచ్చేశావు అని అంటోందే.. ఇన్నాళ్లు ఎక్కడున్నావంటూ నీమీదే అలుగుతోందే..’ అంటూ సాగుతోందీ పాట. కళ్యాణ్ నాయక్ స్వరపర్చిన ఈ పాటను భాస్కరభట్ల రాయగా, పీవీఎన్‌ఎస్ రోహిత్, హరిణి ఇవటూరి పాడారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ:  కార్తీక్ సుజాత సాయికుమార్; ఎడిటర్: విజయ్ ముక్తావరపు.