17 April, 2026 | 10:28 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

హౌసింగ్ బోర్డ్ కాలనీని అభివృద్ధి చేసి చూపిస్తా

30-04-2025 12:00 AM

నూతన అధ్యక్షుడు కొండా నాగరాజు

హనుమకొండ, ఏప్రిల్ 29 (విజయ క్రాంతి): హనుమకొండలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ కమిటీ ఎన్నికలు స్థానిక కమిటీ హాల్లో  నిర్వహించారు.ఈ ఎన్నికలలో ప్రత్యర్థి మీద కొండా నాగరాజు అత్యధిక మెజార్టీతో అధ్యక్షుడుగా గెలుపొందారు.

ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు కొండా నాగరాజు మీడియాతో మాట్లాడుతూ హౌసింగ్ బోర్డ్ కాలనీని అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. కాలనీకి పూర్వ వైభవం తీసుకొస్తానని, కాలనీలో అద్వాన్నంగా ఉన్న పలు సమస్యలను వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లానని, తన వంతు సహకారం అందిస్తానని తెలిపారన్నారు.

ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, కమ్యూనిటీ హల్ నిర్మాణం, పాత భవనాలకు రిపేర్లు, కలర్స్ వేసి మోడల్ కాలనీగా తయారు చేస్తానని తెలిపారు. తనను అధ్యక్షుడుగా ఎన్నుకున్న కాలనీ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. హౌజింగ్ బోర్డు కాలనీ ప్రధాన కార్యదర్శిగా గంగుల వినోద, కోశాధికారిగా బేతేల్లి రవి ఎన్నికయ్యారు.