30-04-2025 12:00:00 AM
ముషీరాబాద్, ఏప్రిల్ 29 (విజయ క్రాంతి) : వీరశైవ లింగాయత్ జంగమ మహేశ్వర వధూవరుల వివాహ పరిచయ వేదికను విశ్వ లింగాయత్ మ్యారేజ్ బ్యూరో ఆధ్వర్యంలో మే 4న మలక్ పేట, శుభకరి పంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నట్లు మ్యారేజ్ బ్యూరో నిర్వహకులు వసారం శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటన లో తెలిపారు.
ఈ వివాహ పరిచయ వేదికను గత 21 ఏళ్లుగా తెలంగాణ, ఏపి, కర్ణాటక రాష్ట్రాలలో నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. వివాహం కాని వీరశైవ లింగాయత్, జంగమ మహేశ్వర వధూవరులు ఈ వేదికను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ పరిచయ వేదిక ఉంటుందన్నారు.
వీరశైవ లింగాయత్ జంగమ మహేశ్వరుల కమ్యూనిటీలోని డాక్టర్లు, ఇంజనీర్స్, ఫీజీ, విదేశీ సంబంధాలను అన్వేశించే వారితో పాటు అన్ని విద్యారతలు ఉన్న వారు, రెండవ సారీ మ్యారేజ్ చేసుకునే వధూవరులు వారి తల్లిదండ్రులతో పాల్గొనాలని కోరారు. పూర్తి వివరాలకు %గీగీగీ.ఖీరిరీనీగీబిజిరిదీవీబిగిబిశిళీబిజీజీబివీలి.బీళిళీ%, లేదా ఫోన్ : 9246359842 నెంబర్ లో సంప్రదించాలని కోరారు.