1 May, 2026 | 2:00 AM

వివేకానంద పార్కును అభివృద్ధి చేస్తా

01-05-2026 12:00 AM

ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, బీఆర్‌ఎస్ నేత అర్వింద్‌రెడ్డి 

ఎల్బీనగర్, ఏప్రిల్ 30 : బీఎన్ రెడ్డి నగర్ డివిజన్  ఎన్జీవోస్ కాలనీలోని వివేకానంద పార్కును అభివృద్ధి చేసి, సర్వాంగా సుందరంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే  దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, బీఆర్‌ఎస్ డివిజన్ అధ్యక్షుడు కటికరెడ్డి అరవింద్ రెడ్డి అన్నారు. స్వామి వివేకానంద పార్క్ వాకర్స్ అసోసియేషన్ కమిటీ సభ్యుల విజ్ఞప్తితో గురువారం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి వివేకానంద పార్కును సందర్శించారు.

పార్కు అభివృద్ధికి సంబంధించిన పలు సమస్యలను అసోసియేషన్ సభ్యులు వివరించా రు. ఆయా సమస్యలను  సాధ్యమైనంత త్వ రగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మె ల్యే సుధీర్‌రెడ్డి హామీ ఇచ్చారు. యోగా షెడ్డు నిర్మాణం కోసం కటికరెడ్డి అర్వింద్‌రెడ్డి ముందుకు రావడం చాలా అభినందనీయమన్నారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు మాధవరం నరసింహారావు, మనోజ్, భాస్కర్, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచిరెడ్డి వెంకట్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ జైపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి జగన్ రెడ్డి, ఉపాధ్యక్షులు మోహన్ రెడ్డి, వెంకట్ రెడ్డి, నారాయణ, జాయింట్ సెక్రటరీ రవీందర్ రెడ్డి, రవిశంకర్, వీరాస్వామి, ఆర్గనైజింగ్ సెక్రటరీ రామకృష్ణారెడ్డి, రామ్ రెడ్డి, అడ్వైజర్స్ మధుసూదన్ రెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.