యూనిఫాం రెండో చర్మం - సేవే మొదటి ధర్మం
సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం.రమేష్
శేరిలింగంపల్లి, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): ప్రజల కన్నీరు తుడిచిన ప్రతి పోలీసు పదవీ విరమణ రోజు గర్వపడాలి. యూనిఫాం మనకు రెండో చర్మం లాంటిది’ అని సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్ అన్నా రు. గురువారం కమిషనరేట్ ఆడిటోరియం లో ఏడుగురు పోలీసు సిబ్బంది పదవీ విరమణ సందర్భంగా వారిని ఘనంగా సన్మా నించారు. పెన్షన్ పత్రాలు అందజేసి, పూలమాలలు, శాలువాలతో ఆత్మీయంగా వీడ్కో లు పలికారు.
సీపీ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో పోలీసుల త్యాగాల వెనుక కుటుంబ సభ్యుల సహకారం మరువలేనిదన్నారు. రిటైర్ అయిన తర్వాత ఆరోగ్యంపై దృష్టి పెట్టి రోజూ వ్యాయామం చేయాలని సూచించా రు. అనుభవజ్ఞులైన మాజీ అధికారులు అవసరమైనప్పుడు శాఖకు సలహాలు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా డీసీపీగా పదోన్నతి పొందిన ఎస్బీ ఏడీసీపీ రవికుమార్‌ను సీపీ అభినందించారు.
పదవీ విరమణ చేసిన ట్రాఫిక్-2 డీసీపీ రంజన్ రతన్ కుమార్ మా ట్లాడుతూ, కానిస్టేబుల్ కుమారుడిగా కెరీర్ మొదలుపెట్టి డీసీపీ స్థాయికి చేరడం గర్వం గా ఉందన్నారు. కార్యక్రమంలో డీసీపీలు టి. అన్నపూర్ణ, ముత్యం రెడ్డి, వై.వి.ఎస్. సుధీంద్ర, టి. సాయి మనోహర్, సృజన కర్ణం, ఏడీసీపీ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.






