నిమ్స్‌లో రక్త మార్పిడి సేవలపై శిక్షణ
పంజాగుట్ట, ఏప్రిల్ 30(విజయక్రాంతి): నిమ్స్ ఆస్పత్రిలో ఏప్రిల్ 21 నుంచి 29 వరకు జరిగిన రక్త మార్పిడి సేవల రిఫ్రెషర్ శిక్షణా కార్యక్రమం ఘనంగా ముగిసింది. ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ విభాగం అధిపతి డాక్టర్ సుధీర్ కుమార్ వుజిని నేతృత్వంలో నిర్వహించిన ఈ సదస్సులో తెలంగాణ వ్యాప్తంగా వివిధ రక్త కేంద్రాల నుండి 225 మంది వైద్యాధికారులు, ల్యాబ్ టెక్నీషియన్లు, నర్సింగ్ సిబ్బందితో పాటు నిమ్స్ బ్లడ్ సెంటర్ విద్యార్థులు, సహాయక సిబ్బం ది పాల్గొన్నారు.
నిపుణులైన వైద్య బృందం రక్త సేకరణ, నిల్వ, అత్యవసర రక్తమార్పిడి పద్ధతులు, ఆధునిక సాంకేతికతలపై సిద్ధాంతపరమైన అంశాలతో పాటు ప్రాక్టికల్ శిక్షణను అందించారు. డీజీహెచ్‌ఎస్, టీజీఎస్‌ఏసీఎస్ వంటి సంస్థల సహకారంతో జరిగిన ఈ కార్యక్రమం వైద్య సేవల్లో నైపుణ్యాన్ని పెంచడానికి ఎంతగానో ఉపయోగప డుతుందని అధికారులు ప్రశంసించారు.






