ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా !
సదాశివపేట, సంగారెడ్డి ఓటర్లకు కృతజ్ఞతలు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
సంగారెడ్డి, ఫిబ్రవరి 13(విజయక్రాంతి): సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించి, ఘనమైన విజయాన్ని అందించిన ప్రజలందరికీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
పార్టీ అభ్యర్థుల విజయం కోసం అహర్నిశలు శ్రమించిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. ఎన్నికల సందర్భంగా తాను ఇచ్చిన హామీ మేరకు సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీల అభివృద్ధికి కట్టుబడి వున్నానని జగ్గారెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రి దామోదర్ నరసింహ, జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి సహకారంతో ఈ రెండు మున్సిపాలిటీలను సమగ్రంగా అభివృద్ధి చేస్తానన్నారు.






