ఎన్నికల్లో పోటీ చేయను
- కశ్మీర్ మాజీ సీఎం మహబూబా ముఫ్తీ
- ఆమెకు బదులుగా బరిలోకి కూతురు ఇల్తిజా
- కారణాలను వివరించిన పీడీపీ అధినేత్రి
జమ్ముకశ్మీర్, ఆగస్టు 28: జమ్ముకశ్మీర్‌లో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న వేళ పీడీపీ అధినేత, మాజీ సీఎం మహబూబా ముఫ్తీ సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను ముఖ్యమంత్రి అయితే తమ పార్టీ ఎజెండాను అమలు చేయడం సాధ్యం కాదన్నారు. ఆమెకు బదులుగా మహబూబా కుమార్తె ఇల్తిజా ముఫ్తీ రాజకీయ అరంగేట్రం చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఆమె తీసుకున్న నిర్ణయానికి సంబంధించి కారణాలను ముఫ్తీ వివరించారు. బీజేపీతో కలిసి 2016లో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు 12 వేల మందిపై ఎఫ్‌ఐఆర్‌లను ఉపసంహరించుకునే చేశా.
ఇప్పుడు ఆ పని చేయగలమా? మేం అధికారంలో ఉన్నప్పుడు వేర్పాటువాదులను చర్చలకు పిలిచాం. ఇప్పుడు సాధ్యమేనా? నేను అధికారంలో ఉన్నప్పుడు కాల్పుల విమరణ అమలు చేశాను? ఈ రోజు బీజేపీ చేయగలదా? అన్నింటికన్నా ముఖ్యంగా అధికరణ లు 370, 35ఏ పునరుద్ధరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చాం. కశ్మీరీ పండిట్లను గౌరవప్రదంగా తిరిగి వచ్చేలా చేస్తామన్నాం. ఇది ఇప్పుడు సాధ్యం కాదు. అందుకే పోటీ నుంచి వైదొలుగుతున్నా ముఫ్తీ స్పష్టం చేశారు.




