రాహుల్‌గాంధీ ఓ చెత్త
- ఆయన పాకులాట అంతా పదవి కోసమే
- బీజేపీ ఎంపీ కంగనా రనౌత్
న్యూఢిల్లీ, ఆగస్టు 28: సినీనటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మరోసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై విమర్శలు గుప్పి ంచారు. ఇండియాటుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె రాహుల్‌పై పరుష పదజా లంతో దూషించారు. ‘ఆయనో చెత్త. ప్రసంగాల్లోనూ, నడవడికలోనూ చెత్తనే’ అని విమర్శించారు. పార్లమెంటులో దేవుళ్ల చిత్రపటా లను ప్రదర్శించటాన్ని తప్పుపడు తూ.. ‘ఆయనకు డ్రగ్స్ టెస్ట్ నిర్వహించాలి’ అని వ్యాఖ్యానించారు. తన స్థాయికి సొంతంగా ఎదగలేదన్నారు. ‘ఇందిరాగాంధీతో పోల్చితే ఆయన మార్గం చాలా భిన్నమైనది.
స్థిరమైన ఆలోచనా విధానం ఉండ దు. కేవలం కుర్చీ కోసమే పరుగెడుతుంటారు. ప్రతిసారి తన మార్గాన్ని మార్చుకొంటుంటారు’ అని విమర్శించారు. రైతు ఉద్యమంపై తాను చేసిన వ్యాఖ్యలపై అధిష్ఠానం తనను మందలించినట్టు కంగన అంగీకరించారు. ‘నన్ను పార్టీ మందలించింది. అది నా మంచికే. నా మాటే పార్టీ తుది మాట అని నేను భావించటంలేదు. అలా అనుకోవటానికి నేను మూర్ఖురాలిని కాదు’ అని పేర్కొన్నారు.




