27 August, 2026 | 4:04 AM

ఉప సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..

22-06-2026 02:11 PM

ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్..

 ఉట్నూర్, జూన్ 22( విజయక్రాంతి): గ్రామపంచాయతీ ఉపసర్పంచుల  సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని  ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఉట్నూర్ మండలంలోని వివిధ గ్రామ పంచాయతీల ఉపసర్పంచులు  సంఘంగా ఏర్పడి సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సోమవారం మండల ఉపసర్పంచ్ లో  సంఘం ఆధ్వర్యంలో  ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో  ఎమ్మెల్యేను కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు సన్మానించి తమ సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. ఉప సర్పంచుల సమస్యల పరిష్కారంతోపాటు  చెక్ పవర్ అందే విధంగా తన వంతు కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు. ఉప సర్పంచుల సంఘం  మండల శాఖ అధ్యక్షుడు  వెడ్మ కొద్దు పటేల్ ల తో పాటు మండల ఉపసర్పంచులు పాల్గొన్నారు.