22 June, 2026 | 3:33 PM

Breaking News

బయోలాజికల్, పీఈటి పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం   •   ఉడుత శంకర్ యాదవ్ తండ్రిని పరామర్శించిన కనీస వేతనాల చైర్మన్ జనక్ ప్రసాద్   •   SIR ప్రక్రియలో తప్పొప్పులకు తావివ్వకండి   •   దుందుభి వాగుపై హై లెవెల్ బ్రిడ్జికి మంత్రి సీతక్క శంకుస్థాపన   •   డీటీవో వెంకన్న మృతి ఘటనపై విచారణకు ఆదేశం   •   బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా.. పదేళ్లలో ఆరుగురు!   •   ఉప సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..   •   శిక్షణా తరగతులు కార్మిక చైతన్యానికి దోహదపడాలి   •   ​ ప్రజా పాలన సినిమా కాదు.. ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించండి: మంత్రి సీతక్క   •   డీటీవో వెంకన్న మృతి పట్ల రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి   •  

బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా.. పదేళ్లలో ఆరుగురు!

22-06-2026 02:27 PM

బ్రిటన్ ప్రధానిగా వైదొలుగుతున్నట్లు కీర్ స్టార్మర్ ప్రకటన 

లండన్: బ్రిటన్ ప్రధానిగా వైదొలుగుతున్నట్లు కీర్ స్టార్మర్ ప్రకటన చేశారు. కీర్ స్టార్మర్ 2024లో బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ప్రధాని పదవిలో విలువలకు కట్టుబడి పనిచేశానని కీర్ స్టార్మర్ వెల్లడించారు. ప్రధానిగా కీర్ స్టార్మర్ తప్పుకుంటారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) నిన్న చెప్పారు. పదేళ్లలో ప్రధాని పదవి నుంచి వైదొలిగిన ఆరో ప్రధానిగా కీర్ స్టార్మర్(UK Prime Minister Keir Starmer resignation) నిలిచారు.

స్టార్మర్ రాజీనామా ప్రకటించడంతో, ఆ కీలక పదవిని చేపట్టే రేసులో ఆండీ బర్న్‌హామ్(Andy Burnham) ముందున్నారు. స్టార్మర్(Keir Starmer resignation) సోమవారం తన రాజీనామాను ప్రకటించి, కొన్ని రోజుల అనిశ్చితికి తెరదించారు. నాయకత్వంలో ఒక కొత్త అధ్యాయం మొదలయ్యే సమయం ఆసన్నమైందని, తన వారసుడికి పూర్తి మద్దతు ఇస్తానని హామీ ఇచ్చారు. పార్టీ భవిష్యత్తుపై విశ్వాసం వ్యక్తం చేస్తూ, అధికార బదిలీ సజావుగా, క్రమబద్ధంగా జరిగేలా చూస్తానని ఆయన ప్రతిజ్ఞ చేశారు.