09-02-2026 01:42:27 AM
పాల్వంచ మున్సిపల్ శాఖ మున్సిపల్ కమిషనర్
పాల్వంచ, ఫిబ్రవరి 8, (విజయ క్రాంతి): తమ ప్రాంతంలో నెలకొన్న సమస్య పరిష్కారానికి అవసరమైతే న్యాయపోరాటమైన చేస్తానని పాల్వంచ పట్టణవాసి పిండి పోలు సీతాలక్ష్మి స్పష్టం చేశారు. ఆదివారం ఆమె విడుదల చేసిన ప్రకటనలో గత రెండు సంవత్సరాలుగా తమ నివాస ప్రాంతమైన ఇంటి నెంబర్ 16- 1-137, స్వాతి స్కూల్ లైన్ పాల్వంచ లో కాలువపై , మున్సిపల్ రోడ్డును ఆక్రమించి అక్రమంగా మేకల షెడ్డు ఏర్పాటు చేయడం జరిగిందనీ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల పరిసర ప్రాంతం తీవ్రంగా కాలుష్యమై, దుర్వాసనతో పాటు దోమలు,
ఈగల పెరుగుదల వల్ల మా కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల ప్రజల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటోందన్నారు. ఈ విషయంపై పలుమార్లు పాల్వంచ మున్సిపల్ శాఖకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలనీ ఆరోపించారు. తాను సమాచార హక్కు చట్టం 2005 (RTI) ద్వారా వివరాలు కోరగా, మున్సిపల్ శాఖ నుండి వాస్తవాలకు విరుద్ధమైన తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపించారు.
ఆక్రమణ తొలగింపుకు చర్యలు తీసుకోకుండా ప్రజలను తప్పుదోవ పట్టించడం జరిగిందనీ, సంబంధిత ఆధారాలను మీ పరిశీలించి ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపి, నాకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను కోరుతున్నారు. తమ సమస్యకు పరిష్కారం చూపన ఎడల. పాల్వంచ ప్రాంతంలోని మేధావులు, రాజకీయ నాయకులు, న్యాయవాదులు, సేవా సంస్థల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసుకొని, న్యాయ పోరాటం చెయ్యడం జరుగుతుంది తెలియజేసారు.