calender_icon.png 9 February, 2026 | 11:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం స్వచ్ఛంద రక్తదానం శిబిరం

09-02-2026 01:41:03 AM

బూర్గంపాడు, ఫిబ్రవరి 8, (విజయక్రాంతి): మండలంలోని ఇరవెండి యువసేన మరియు సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని స్థానిక సర్పంచ్ గుండి బాబురావు, ఉపసర్పంచ్ ల సంఘం జిల్లా అధ్యక్షులు మహంకాళి రామారావు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తలసేమియా జన్యుపరమైన రక్త రుగ్మత వ్యాధి అని, సరైన చికిత్స తీసుకోకపోతే ప్రాణాంతకంగా మారుతుందన్నారు. తలసేమియా వ్యాధిలో బాధపడుతున్న వారందరికీ ఇరవై నుంచి నెల రోజుల లోపు రక్తం అవసరమవు తోందని, వారందరి ప్రాణాలు నిలవాలంటే రక్తం ఎంతో అవసరమని తెలిపారు. అలానే ఈ శిబిరంలో సిఆర్పిఎఫ్ కోబ్రా కానిస్టేబుల్ టీమ్ కూడా పాల్గొని రక్త దానం చేశారు. ఈ కార్యక్రమంలో యువసేన సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.