6 April, 2026 | 9:19 PM

ప్రజా సమస్యలపై ప్రజల కొరకు నిరంతరం కృషి చేస్తా

06-04-2026 07:27 PM

కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మల్లెపూల శ్రీకాంత్ యాదవ్

జవహర్ నగర్,(విజయక్రాంతి): ప్రజా సమస్యలపై ప్రజల కొరకు, పార్టీ ప్రతిష్టకు కృషి చేస్తానని, ఇందిరమ్మ పాలనలో ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండలన్నదే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా అధికార ప్రతినిధి మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ అన్నారు. జిల్లా అధికార ప్రతినిధిగా ఎన్నికైనా మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ జవహర్ నగర్ లోని పలు కాలనీవాసులు, కులసంఘాల నాయకులు సోమవారం కలిసి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో మరింత ఆదరణ పెరుగుతుందని, అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్ళను అందజేస్తామని అన్నారు. జిల్లా అధికార ప్రతినిధిగా ఎన్నికైనందుకు నాపై మరింత బాధ్యత పెరిగిందని పేర్కొన్నారు. అనంతరం పలువురు శ్రీకాంత్ యాదవ్ కు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కులుసంఘాలు, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.