అస్సాంలో ఘోర విమాన ప్రమాదం : ఐదుగురు మృతి
గువహతి: అస్సాంలోని జోర్హాట్ జిల్లాలో(Jorhat) శనివారం నాడు ల్యాండ్ అవుతుండగా భారత వైమానిక దళానికి చెందిన AN-32 విమానం(IAF Aircraft AN-32 Crashes) కుప్పకూలిందని రక్షణ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. విమాన ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. మృతుల్లో ఇద్దరు అధికారులు, ముగ్గురు సిబ్బంది ఉన్నారు.
భారత వైమానిక దళ (Indian Air Force) స్థావరంలో విమానం ల్యాండింగ్ అవుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. వైమానిక దళానికి చెందిన ఉన్నతాధికారులు హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకున్నారని, ప్రాణనష్టం ఏమైనా జరిగిందా అనేది ఇంకా నిర్ధారించాల్సి ఉందని అధికార ప్రతినిధి పేర్కొన్నారు. ప్రమాదస్థలంలో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, మరిన్ని వివరాలు తెలియాల్సిఉందని అధికారులు తెలిపారు.






