22-02-2026 12:41:59 AM
ప్రారంభించిన అదనపు కలెక్టర్ భాస్కర్ రావు
విద్యార్థులకు ఉన్నత లక్ష్యాల దిశగా మార్గదర్శనం
భువనగిరి, ఫిబ్రవరి 21(విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్ట ణంలోని విజ్ఞాన్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ పగిడాల జలందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఐఏ ఎస్, ఐపీఎస్ ఫౌండేషన్ ప్రోగ్రాంను శనివా రం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్ర మాన్ని జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ సంయుక్తంగా ప్రారంభించారు.ఈ సంద ర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఇలాంటి ఫౌండేషన్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించడం అభినందనీయమని తెలిపారు.
ఈ అవకా శాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలకు చేరాలని ఆకాంక్షించారు. కార్యక్రమాన్ని నిర్వహించిన విజ్ఞాన్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ డాక్టర్ పగిడాల జలం ధర్ రెడ్డిని అభినందించారు.ఈ కార్యక్ర మంలో గ్రంథాలయ సంస్థల చైర్మన్ మహ మ్మద్ అవేజ్ చిస్తి, జిల్లా విద్యాధికారి సత్య నారాయణ, మండల విద్యాధికారి నాగవ ర్ధన్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్, వైస్ చైర్మన్ పోతంశెట్టి మంజుల వెంకటేష్, స్వర్ణగిరి ఆలయ చైర్మన్ రామారావు, లింగ నరసింహారావు, ప్రోగ్రాం కోఆర్డినేటర్ రామ్ రెడ్డి, కరస్పాండెంట్ పగి డాల పురేందర్ రెడ్డి, ప్రిన్సిపాల్స్ అపర్ణ, స్వా తి, పక్కిరు కొండల్ రెడ్డి, విద్యార్థులు, తల్లి దండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.