calender_icon.png 22 February, 2026 | 2:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐఐఎంసీ కళాశాలలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

22-02-2026 12:40:13 AM

భారతీయ భాషల విభాగం ఆధ్వర్యంలో నిర్వహణ 

హైదరాబాద్(ఖైరతాబాద్), ఫిబ్రవరి ౨౧(విజయక్రాంతి): ఖైరతాబాద్‌లోని ఐఐఎంసీ కళాశాల భారతీయ భాషల విభాగం ఆధ్వర్యంలోశనివారం అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం కళాశాల సమావేశ మం దిరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన కళా శాల చైర్మన్ కృతిమ మేథా యుగంలో మా తృభాష అనే అంశంపై మాట్లాడారు. ఈ ఆధునిక యుగాన్ని కృత్రిమ మేథా యుగం గా పిలుస్తున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మాతృభాష ప్రాముఖ్యత గురించి చర్చించడం అత్యంత అవసరమని తెలిపారు. మాతృభాష మన సంస్కృతికి పునా ది.. మాతృభాష మన భావాలను, ఆలోచనలను సహజంగా వ్యక్తపరచే సాధనమన్నారు.   

ప్రస్తుతం తెలుగు వంటి భాషల్లో కూ డా అనేక డిజిటల్ సాధనాలు అభివృద్ధి చెం దుతున్నాయన్నారు. ఏఐ ఆధారిత విద్యా వేదికలు మాతృభాషలో అందుబాటులో ఉంటే గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఎం తో ప్రయోజనం కలుగుతుందని అన్నారు. ఏఐ యుగంలో మాతృభాషను కాపాడుకోవడం మన అందరి బాధ్యత. సోషల్ మీడి యాలో, సాంకేతిక వేదికలలో, విద్యా రంగం లో మాతృభాష వినియోగాన్ని పెంచాలి. సాంకేతికతను ఉపయోగించి మన భాషను ప్రపంచానికి పరిచయం చేయాలని తెలియజేశారు. కంప్యూటర్ విభాగం అధ్యాపకులు సత్యనారాయణ మాట్లాడుతూ కృత్తిమ మేథను ఉపయోగిస్తూనే మన ఆలోచనలను కూడా పదను పెట్టాలని తెలియజేశా రు.

తెలుగు విభాగం అధ్యక్షులు ఇ.రామకృష్ణ మాట్లాడుతూ ఈ సంవత్సరం అంత ర్జాతీయ మాతృభాషా దినోత్సవానికి  యు నెస్కో ప్రతిపాదించిన నినాదం బహుభాషా విద్యా వ్యవహారాల్లో యువత ప్రతిధ్వని అని తెలియజేస్తూ ఫిబ్రవరి 21 అనేది క్యాలెండర్ లోని ఒక సాధారణమైన తేదీ కాదు ఒక జా తి అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి సజీవ ప్రతీక అని అన్నారు. 1952లో బెంగాలీ భాష ఉద్యమంలో మాతృభాష కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరుల స్మృత్యర్థం యునెస్కో ఈ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ప్రకటించిందన్నారు.

అంతటి గొప్ప ఉద్య మం నుంచి పుట్టిన ఈ వేడుకను ్ర మాతృభాషా దినోత్సవంగా జరుపుకోవడం గర్వణీయమన్నారు. కార్యక్రమంలో కళాశాల డీన్ (అకాడమిక్) డాక్టర్ తిరుమలరావు, ప్రశాంత్, భారతీయ భాషల విభాగం అధ్యాపకులు జి. సుష్మ, జి ఏ వి కళ్యాణి, ఎ న్. మాధవి, అనిత, శివ, శ్రీనివాస్, నాగ శిరీ ష, శ్రీనాథ్, శ్యాం, విజయానంద్ గౌడ్ మరియు ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.