విచారణకు శ్రీలక్ష్మి.. ఏం జరగనుంది?
ఓబులాపురం కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మి.. సీబీఐ కోర్టుకు హాజరు
హైదరాబాద్: చాలాకాలంగా న్యాయస్థానాల్లో కొనసాగుతున్న ఓబులాపురం మైనింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి బుధవారం సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. ఓబులాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ)కి సంబంధించిన కేసులో ఆమెపై అభియోగాల నమోదు, తదుపరి విచారణ ప్రక్రియ ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇవి కూడా చదవండి: సాగునీటిపై ఆశలు
గతంలో శ్రీలక్ష్మికి ఉపశమనం కల్పిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సీబీఐ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కేసును పునఃపరిశీలించిన హైకోర్టు, 2025 జూలైలో ఆమె దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. దీంతో సీబీఐ కోర్టులో విచారణను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ కేసులో గాలి జనార్దన్ రెడ్డి, బీవీ శ్రీనివాస రెడ్డి తదితరులపై ఇప్పటికే విచారణ జరిగి తీర్పులు వెలువడ్డాయి. మరోవైపు, సబితా ఇంద్రారెడ్డి, కృపానందం విషయంలో కోర్టు గతంలో వేర్వేరు నిర్ణయాలు తీసుకుంది. ఓబులాపురం మైనింగ్ వ్యవహారంలో నమోదైన ఆరోపణలు, వాటిపై కొనసాగుతున్న న్యాయప్రక్రియ నేపథ్యంలో శ్రీలక్ష్మికి సంబంధించిన తదుపరి విచారణపై ఆసక్తి నెలకొంది.