calender_icon.png 6 August, 2025 | 1:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీనియస్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఐడియా బాక్స్ ఆవిష్కరణ

05-08-2025 10:51:22 PM

సదాశివపేట,(విజయక్రాంతి):  సదాశివపేటలోని జీనియస్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ లో మంగళవారం మండల విద్యాధికారి ఎన్ శంకర్ ఐడియా బాక్స్ ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా  మండల విద్యాధికారి శంకర్ మాట్లాడుతూ... విద్యార్థులందరూ  సృజనాత్మకంగా ఆలోచించాలని మరియు భవిష్యత్తులో మంచి శాస్త్రవేత్తలుగా ఎదగడానికి ఇటువంటి ఐడియా బాక్సులు ఎంతగానో దోహదపడతాయని సదాశివపేట పట్టణంలో మొదటిసారిగా ఐడియా బాక్స్ ను ఆవిష్కరించిన జీనియస్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ యాజమాన్యాన్ని మరియు ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు.