05-08-2025 10:54:22 PM
వికలాంగుల డిమాండ్లపై పోరుబాట
రెండేళ్లుగా కాంగ్రెస్ సర్కార్ మొండి చేయి
కామారెడ్డి వికలాంగుల గర్జన సభలో మందకృష్ణ మాదిగ
కామారెడ్డి,(విజయక్రాంతి): కాంగ్రెస్ సర్కారు వికలాంగులకు పెన్షన్ నెలకు 6 వేల పెంచుతామని హామీ ఇచ్చి విస్మరించిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్న వికలాంగులకు మొండి చేయి చూపిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ విమర్శించారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో లక్ష్మీదేవి గార్డెన్లో నిర్వహించిన వికలాంగుల గర్జన సభకు ముఖ్యఅతిథిగా హాజరై మందకృష్ణ మాదిగ మాట్లాడారు.
ఎన్నికల ముందు వికలాంగులకు కాంగ్రెస్ సర్కార్ నెలకు 6000 రూపాయలు పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చి రెండేళ్లు గడుస్తున్న విస్మరించిందని మొండి చేయి చూపిందని ఆరోపించారు. వికలాంగుల సమస్యలపై కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు. వికలాంగుల సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని పోరుపాట తప్పదని అన్నారు. త్వరలో హైదరాబాద్ లో మహా ధర్నా నిర్వహిస్తున్నట్లు మందకృష్ణ మాదిగ వెల్లడించారు. ఉమ్మడి నిజాంబాద్ జిల్లా వ్యాప్తంగా వికలాంగుల మహ ధర్నాకు హాజరుకావాలని రాష్ట్రవ్యాప్తంగా వికలాంగులు వికలాంగుల పోరాటానికి మద్దతు నివ్వాలని మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు.
పదేళ్లు కెసిఆర్ సర్కారు వికలాంగుల సమస్యలపై నిర్లక్ష్య ధోరణి వహించారని విమర్శించారు. వికలాంగులను, వ యోవృద్ధులను, కేసీఆర్ టిఆర్ఎస్ ప్రభుత్వం పట్టించు కోలేదని విమర్శించారు. ప్రభుత్వ నిధులను కాలేశ్వరం ప్రాజెక్టు తరలించి వేలకోట్ల రూపాయలు దిగమింగారని ఆరోపించారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా వికలాంగుల సమస్యలపై పోరుబాట చేపడుతున్నట్లు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ వెల్లడించారు.