11 August, 2026 | 1:48 AM

చినుకు పడితే చిత్తడే..

11-08-2026 12:05 AM

గుంతల మయంగా మారిన కొత్తపల్లి బీటీ రోడ్డు

గంభీరావుపేట, ఆగస్టు 10(విజయ క్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి బీటీ రోడ్డు దయ నీయ స్థితికి చేరుకుంది. స్వల్ప వర్షానికే ఈ రహదారి పూర్తిగా బురదమయంగా మారి, ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. రోడ్డంతా గుంతలతో నిండిపోవ డంతో వాహనదారులు ప్రాణాలు అరచేతి లో పెట్టుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది.ప్రత్యేకంగా కొత్తపల్లి ఎల్లమ్మ ఆలయం నుండి శిలాజి నగర్ వరకు ఉన్న సుమారు నాలుగు కిలోమీటర్ల రహదారి అత్యంత ప్రమాదకరంగా మారింది. వర్షపు నీరు గుంతల్లో నిలిచిపోవడంతో వాహనదారులు గుంతల లోతు అంచనా వేయలేక ప్ర మాదాలకు గురవుతున్నారు.

ఈ మార్గంలో ప్రయాణించడం నరకయాతనగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెదక్, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాలను కలిపే ముఖ్య రహదారి కావడంతో ప్రతిరోజూ వందలాది మంది ఈ మార్గంలో ప్రయాణిస్తుంటారు. అయినప్పటికీ ఏళ్లుగా రోడ్డు మరమ్మతులు చేపట్టకపోవడం పట్ల గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు ర్యాలీలు, నిరసనలు, ధర్నాలు నిర్వహించినప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం పట్ల తీవ్ర అ సంతృప్తి వ్యక్తమవుతోంది.ఇప్పటికైనా ప్రభు త్వం స్పందించి ఈ రహదారిని తక్షణమే మరమ్మతులు చేసి, డబుల్ రోడ్డుగా అభివృ ద్ధి చేయడానికి నిధులు మంజూరు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

గుంతలతో ఇబ్బందులు..

 మా గ్రామంలోని బిటి రోడ్డుపై ఏర్పడిన గుంతలతో ఏళ్లుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ బీటీ రోడ్డు సమస్యను మంత్రుల దృష్టికి తీసుకెళ్లిన నిధులు మంజూరు చేయడం లేదు. ప్రతిరోజు వాహనదారులకు ప్రమాదాలు బారిన పడి ఆసుపత్రుల పాలవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి డబల్ రోడ్డుకు నిధులు మంజూరు చేయించాలి.

బినమేని శ్రవణ్ యాదవ్ కొత్తపల్లి

డబల్ రోడ్డుకు నిధులు మంజూరు చేయాలి..

ఈ ప్రాంత పాలకుల నిర్లక్ష్యంతో కొత్తపల్లి ప్రధాన రోడ్డు దయనీయ స్థితికి చేరుకుంది. ధర్నాలు రాస్తారోకోలు నిరసనలు చేసినప్పటికీ గత ప్రభుత్వంలో నిధులు మంజూరు కాలేదు. ఈ కాంగ్రె స్ ప్రభుత్వంలోనైనా డబల్ రోడ్డుకు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

గౌటే గణేష్, కొత్తపల్లి