15 తర్వాత ఉద్యమమే
- క్యూర్‌పై ప్రజాభిప్రాయం తీసుకుంటాం
- ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే ఊరుకోం
- ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు
- రేవంత్ వరుణయాగం చేస్తే మేం వాళ్లు కొట్టుకుపోవాలని వాయుయాగం చేస్తాం!
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
హైదరాబాద్, ఆగస్టు 10 (విజయక్రాంతి): ఈనెల 15 తర్వాత ఉద్యమబాట చేపడతామని, ఉద్యమ స్ఫూర్తిని చూపిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ఇటీవల తమ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌తో చెప్పినట్లు ఆయన వెల్లడించారు. క్యూర్‌పై సెమినార్ నిర్వహించి, ప్రజాభిప్రాయం తీసుకుంటా మని, ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే ఊరుకోబోమన్నారు.
సర్ తర్వాత జీహెచ్‌ఎంసీ ఎన్నికలుండే అవకాశముందని, బంకీపూర్ ఉపఎన్నికలో అభ్యర్థి ఎంపికలో జాప్యం జరిగిందని పేర్కొన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తామని ఆయన చె ప్పారు. సీఎం రేవంత్ వరుణయాగం చేస్తే, తాము వాళ్లు కొట్టుకుపోవాలని వా యుయాగం చేస్తామని, క్షుద్రపూజలను తమ పార్టీ నమ్ముకోలేదన్నారు. హిట్లర్ ఆలోచనలు, హిల్ట్, హైడ్రా (ట్రిపుల్ హెచ్)పాలసీలతో రాష్ట్ర అభివృద్ధి హాల్ట్ అయ్యిందని విమర్శించారు.
అధికారులను ఉద్దేశించి కోర్టు వ్యాఖ్యలను పరిశీ లిస్తే రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ పూ ర్తిగా ఫె యిలయ్యిందని స్పష్టమవుతుందన్నారు. సోమవారం పార్టీ కార్యాలయం లో మీ డియాతో రాంచందర్ రావు చిట్ చాట్ చేసారు. తాము ఇతర పార్టీలలాగా క్షుద్ర పూజలను నమ్ముకోలేదు.. ప్రజా పూజ ను నమ్ముకున్నామన్నారు. అమెరికా భా రత్‌గా మారిందని, ఎక్కడ చూ సినా భారతీయులే ఉన్నారన్నారు.
ఢిల్లీలో నితిన్ నబీన్‌తో చర్చించామని, రాష్ట్రం లో అధికారమే లక్ష్యంగా పనిచేయాలని జాతీయ పార్టీ డైరెక్షన్ ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో పరిపాలనా లోపంతోనే అధికారులపై చర్యలు తీసుకుం టున్న పరి స్థితి ఏర్పడిందన్నారు. హైడ్రా చేపడుతున్న పనుల వల్ల కమిషనర్ రంగనాథ్‌పై కోర్టు సీరియస్ అయిందన్నారు.
బాలాపూర్, నాదర్‌గుల్ వద్ద భూములన్నీ ప్రభుత్వ భూములు, భూదాన్ భూములేనని, వాటిని పేదలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ భూముల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని, వాటిని కాపాడాల్సిన బాధ్యత హైడ్రాపై లేదా? అని ప్రశ్నించారు.
ఎంఐఎం నేతల ఆస్తులపై చర్యలేవి?...
మజ్లిస్ పార్టీ నేతల ఆస్తులపై కోర్టు చెప్పాక కూడా ప్రభుత్వం తప్పించుకునే ప్ర యత్నం చేస్తోందన్నారు. కాంగ్రెస్ నిర్ణయాల వల్ల ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారని, ఈనెల 15 తర్వాత క్యూర్‌పై పబ్లిక్ ఒపీనియన్ తీసుకునేందుకు వర్క్ షాప్ నిర్వహిస్తామన్నారు. క్యూర్‌తో సామాన్యులపై భారం పడుతుందని, అందుకే రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడుతామన్నారు.
ఆర్థిక శాఖ మం త్రిగా ఉన్న సమయంలో చిదంబరం.. బ్లెం డెడ్ ఇథనాల్ పెట్రోల్‌పై ఆన్ రికార్డ్ మాట్లాడారని, కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన ప్రతిపాదనలే ఇవన్నీ, 2013లో గెజిట్ కూడా వచ్చిందన్నారు. 40 వేల కిలోమీటర్ల.. మేర వాహ నం ఎలాంటి ఇబ్బందులు లేకుండా నడుస్తోందని తెలిశాకే దీన్ని అమలు చేస్తున్నా రన్నారు. కోర్టులను కూడా అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు.
వెళ్లే వారిని ఆపలేం...
సర్ వల్ల తమ పార్టీ యాక్టివిటీ కొంత తగ్గిందని, ఇదే విషయాన్ని జాతీయ నాయకత్వానికి వివరించామన్నారు. పంద్రాగస్టు తర్వాత ఉద్యమాల స్వరూపాన్ని చూపిస్తామని చెప్పారు. ధరణి, భూ భారతికి పెద్ద తేడా ఏమీ లేదని, వాళ్ళు ఒకలా దోచుకుంటే.. వీళ్ళు మరోలా దోచుకుంటున్నారని ఆరోపించారు. బీహార్ బంకీపూర్ ఉపఎన్నిక ఓటమికి అభ్యర్థి ఎంపికలో జాప్యం, అతితక్కువగా పోలింగ్ శాతం నమోదు కావడం కారణమైందని భావిస్తున్నామన్నారు.
సినిమా పిచ్చి ఉన్నవాళ్ళు కొంతమంది జనసేనలో పోతున్నారని, వెళ్లిన వారిని అడిగితే తాను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని అంటున్నారని, అయితే గతంలో ఎందుకు వెళ్లలేదని అడిగితే అప్పుడు తెలంగాణలో జనసేన లేదని బదులిచ్చారన్నారు. వెళ్లేవారిని అడ్డుకోలేమన్నారు.
సర్ ప్రక్రియ తర్వాత జీహె చ్‌ఎంసీ ఎన్నికలు వస్తాయని భావిస్తున్నామన్నారు. వాస్తవానికి ఈ ఎన్నికలకు ప్రక్రియ తో సంబంధం లేదు.. కానీ కొత్త ఓటర్ లిస్ట్ ప్రకారమే ఉంటుందని నమ్ముతున్నామని ఆ యన చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు అవకాశాలు ఉన్నవారికే అవకాశం కల్పిస్తామని తెలిపారు.
రేవంత్ ఈసారి ఏ వర్సిటీకు వెళ్తారో..
సీఎం రేవంత్ వరుణయాగం చేస్తే.. తాము వాళ్ళు కొట్టుకుపోవాలని వాయుయాగం చేస్తామని ఎద్దేవా చేశారు. ఎల్ నినో వచ్చిందని తెలిసిన సీఎం.. ముందే యాగం చేయొచ్చు కదా..అన్నారు. వర్షాకాలం ముగిసే సమయానికి చేయడం ఎం దుకు? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఈసారి ఏ యూనివర్సిటీకి వెళ్తాడో మరి.. ఏ కోర్సు చేసి వస్తారో చూడాలన్నారు. పార్టీలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ లీడర్లందరికీ కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తామని చెప్పా రు. ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు అందరికీ రానున్న రోజులల్లో రకరకాల బాధ్యతలు అప్పగిస్తామన్నారు.
రేపు స్కార్‌పియో వస్తుందేమో...
ఢిల్లీలో నిరసన చేసిన వారిలో వామపక్ష విద్యార్థి సంఘాలు, ఇతర పార్టీలకు చెందని వారే ఉన్నారని ఆయన చెప్పారు. వీరందరితోనే కాక్రోచ్ పార్టీ అని పేరుపెట్టారన్నారు. నేడు కాక్రోచ్.. రేపు స్కార్‌పియో వచ్చినా ఆశ్చర్యంలేదన్నారు. కేంద్రం ఏం చేసినా దా నికి వ్యతిరేకంగా ఇండి కూటమి, ఆప్ పార్టీ నాయకులు వ్యతిరేకిస్తున్నారన్నారు.
జెన్-జీలకు మంత్రి పదవి ఇవ్వాలి
కాంగ్రెస్‌లో జెన్ జీ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా.. వారికి మంత్రి పదవి ఇవ్వొచ్చు కదా? అని ఆయన ప్రశ్నించారు. తన వద్ద ఉన్న శాఖలను ఎవరికై నా ఇవ్వొచ్చుగా అన్నారు. డాక్టర్ బీఆర్. అంబేద్కర్ ఆలోచించి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరు పోటీ చేయాలని చెప్పారని, అయితే ఫీజురీయింబర్స్‌మెంట్‌పై ప్రశ్నిస్తారని భావించి సీఎం వారిని సంతోష పెట్టేందుకు అలాంటి వ్యాఖ్యలు చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వానికి క్విట్ ఇండి యా ఉద్యమం ఎలా ఉంటుందో చూ పించాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారని, అసలు క్విట్ ఇండియా ఉద్యమం వచ్చిందే కాంగ్రెస్ వల్ల అని తాము కూడా ప్రజలకు వివరిస్తామన్నారు.






