3 August, 2026 | 12:03 AM

కేసీఆర్ జోలికొస్తే తెలంగాణ అగ్నిగుండమే

03-09-2025 12:00 AM

తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరంపై కాంగ్రెస్ విషప్రచారం

మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

వనపర్తి, సెప్టెంబర్ 02 (విజయక్రాంతి):  మాజీ సిఏం కే సి ఆర్ జోలికి వస్తే తెలంగాణ అగ్ని గుండంగా మారుతుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ను హెచ్చరించారు.   కాళేశ్వరం ప్రాక్టుపై ఘోష్ కమిషన్ వేసి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాన్ని నిరసిస్తూ మంగళ వారం స్థానిక బి.ఆర్.ఎస్ శ్రేణులు జిల్లా కేంద్రం లోని అంబేద్కర్ చౌరస్తాలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమము చేపట్టారు. 

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో గోదావరి,కృష్ణా నదులపై ప్రాజె క్టులు  కట్టకుండా తెలంగాణకు కాంగ్రెస్, టి.డి.పి పార్టీలు తీరని ద్రోహం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేండ్లు అవుతున్నా 10శాతం మిగిలిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయకుండా తమ అసమర్థతను కప్పిపుచ్చు కోవడం కోసం కె.సి.ఆర్ పై కుట్ర కమిషన్ వేసి దుష్ప్రచారం చేయడం దారుణమని  నిజంగా రేవంత్ పాలమూరు బిడ్డ అయితే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గట్టు యాదవ్, వాటిటి శ్రీధర్, పలుస రమేష్ గౌడ్, నందిమల్ల అశోక్, నాయకులు పాల్గొన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ చారిత్రాత్మకం..

గద్వాల టౌన్ సెప్టెంబర్ 2:  కాలేశ్వరం ప్రాజెక్ట్ చారిత్రా త్మక ప్రాజెక్టు అని  బి ఆర్ ఎస్ గద్వాల నియోజకవర్గ ఇంచార్జి బాసు హనుమంత నాయుడు అన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని తప్పుబడుతూ బీఆర్‌ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణ పుర వీధుల్లో భారీగా బైక్ ర్యాలీ నిర్వహించి కృష్ణవేణి చౌక్ నందు రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.  

సీబీఐ, ఈడీలు ఏం చేయలేవు..జడ్చర్ల మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి

జడ్చర్ల సెప్టెంబర్ 2 : సిబిఐ, ఈడీలు బిఆర్‌ఎస్ పార్టీని ఏమి చేయలేవని మాజీమంత్రి డాక్టర్ సీ లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం  కాలేశ్వరం ప్రాజెక్టు పై విచారణ చేయడం అంశాన్ని సిబిఐ కి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించడం సరికాదని డిమాండ్ చేస్తూ జడ్చర్ల తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు.  మాజీ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి మాట్లాడారు. కాళేశ్వరం కమిషన్ దాదాపు రెండేళ్ళు విచారణ చేసినా ప్రాజెక్టు లో లొసుగులు దొరకలేదన్నారు. కమిషన్ రిపోర్ట్ లో ఏం లేదని... పరువు పోతుందనే ఉద్దేశ్యం తో కేసీఆర్ ని ఎట్లా అయినా ఇరికించాలని సీబీఐ కి ప్రభు త్వం అప్పగించిందని విమర్శించారు.

కాళేశ్వరంలో లక్షకోట్ల అవినీతి అని జరిగిందని ఇష్టంసారంగా ఎవరెవరో మాట్లాడు తున్నారని ఇది సరైన పద్ధతి కాదన్నారు. ప్రాజెక్టు ఖర్చు లక్ష కోట్లు కానపుడు... అవినీతి లక్ష కోట్లు ఎట్లా జరుగుతుందని, మాట్లాడేవాళ్ళకు ఒక్కసారి స్మరించు కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్రంలో 16 మంది ఎంపీలు ఉన్న కనీసం యూరియా తీసుకువచ్చేందుకు చేతకాలేదని విమర్శిం చారు. గడచిన పదేళ్లలో బిఆర్‌ఎస్ పార్టీ రైతులకు సకల సౌకర్యాలు కల్పించిందన్నారు. ప్రభుత్వం ఇష్టానుసార నిర్ణయాలను మానుకొని ప్రజల సంక్షేమం వైపు ప్రయాణించాలని సూచించారు. మాజీ జెడ్పి వైస్ చైర్మన్ కోడుగల్ యాదయ్య, ప్రభాకర్ రెడ్డి, ప్రనిల్ చందర్  ఉన్నారు.

గోపాలపేటలో.. 

 గోపాలపేట సెప్టెంబర్ 2 : రేవంత్ రెడ్డి నీవు అసలైన పాలమూరు బిడ్డ వైతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసి చూపించాలని బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు సవాల్ విసిరారు. మంగళవారం వనపర్తి జిల్లా గోపాలపేట మం డలం కేంద్రంలో టిఆర్‌ఎస్ నాయకులు నిరసనలు వ్యక్తం చేస్తూ మాట్లాడారు. ఈ సందర్భంగా బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు బాలరాజు రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు తిరుపతి యాదవ్ మాట్లాడారు. తెలంగాణ వరప్రధాయిని కాలేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ వేసి కాంగ్రెస్ పార్టీలో దృశ్య ప్రచారాన్ని చేస్తున్నారని అన్నారు.

తెలంగాణ సాధించిన కెసిఆర్ కృష్ణానదిపై పాలమూరు రంగారెడ్డి ప్రాజె క్టులను నిర్మించి 12 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చింద న్నారు. గోదావరి నదిపై రికార్డు స్థాయిలో మూడేళ్లలోనే కాలేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి 70 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించి తెలంగాణను పచ్చదనంతో సస్యశ్యామలం చేశారని అన్నారు.  రైతుబంధు కోఆర్డినేటర్ తిరుపతి యాదవ్ మాజీ వైస్ ఎంపీపీ చంద్రశేఖర్ మాజీ సర్పంచ్ శ్రీనివాసులు వడ్డే గోపాల్ బిళ్ళ కంటి రాజు, వెంకటయ్య రాంబాబు నాగ రాజు రాజేష్ చారి బాల్రెడ్డి ఎండి జాంగిర్ నారాయణ రావు శ్రీనివాసరెడ్డి వెంకటేశ్వరరావు ధర్మయ్య మన్యం నాయక్ కృష్ణారావు సత్యనారాయణ వెంకటయ్య తిరుపతి మాజీ ఎంపిటిసి కురుమయ్య లక్ష్మారెడ్డి శంకరయ్య వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.