ఊరేగింపుగా అమ్మవారికి బోనం
ముషీరాబాద్, ఆగస్టు 2 (విజయక్రాంతి): ముషీరాబాద్ లో చారిత్రాత్మకమైన మహాకాంళి దేవాలయ ప్రధాన అర్చకులు వై. చంద్రమౌళి ఆధ్వర్యంలో ఆదివారం అమ్మవారికి మొదటి బోనం సమర్పించారు. ఈ సందర్భంగా భరత్ నగర్ లోని ఆలయ ప్రధాన అర్చకుడు వై. చంద్రమౌళి ఇంటి నుంచి పోతరాజుల ఊరేగింపు, బ్యాండ్ మేళాలతో సంప్రదాయ పద్దతిలో ఊరేగింపుగా ముషీరాబాద్ లోని ఆలయానికి చేరుకొని బోనంతో అమ్మవారికి నైవేద్యం సమర్పించారు.
ఈ సందర్భంగా వై. చంద్రమౌళి, దేవాదాయ శాఖ ఈఓ మహేందర్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల 9,10 తేదీలలో అమ్మవారి దేవాలయంలో బోనాల ఉత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. వారం రోజుల పాటు అమ్మవారి గట్టాన్ని ఆలయ పురవీధుల్లో ఊరేగించి భక్తులకు దర్శనం కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీధర్ చారి, కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ ఉపాధ్యక్షుడు జనిగె శ్రీనివాస్ యాదవ్, నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు పట్నం నాగభూషణం గౌడ్, కార్యదర్శి రామకృష్ణ, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ ఎయిర్టెల్ రాజు తదితరులు పాల్గొన్నారు.






