17 April, 2026 | 9:39 PM

Breaking News

రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •   ఉస్మానియా యూనివర్సిటీ పాలకమండలి ఈసీ సభ్యురాలుగా డాక్టర్ బి.సుజాత   •   కులగణన లెక్కలు పబ్లిక్ డొమైన్‌లోకి మల్లన్న నిరంతర పోరాట ఫలితం   •   ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి   •   నార్సింగిలో ఉద్యోగుల నిరసన.. తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పణ   •   రోడ్డు ప్రమాద సమయంలో గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతపై అవగాహన   •  

స్థలం కేటాయిస్తే బస్టాండ్ నిర్మాణం కోసం కృషి చేస్తాం

17-04-2026 08:15 PM

బెజ్జూర్,(విజయక్రాంతి): బస్టాండ్ నిర్మాణం కోసం స్థలం కేటాయిస్తే బస్టాండ్ నిర్మాణం కోసం కృషి చేస్తామని ఆర్ ఎం విజయ భాను తెలిపారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం లోని కాగజ్ నగర్, కౌటాల, పెంచికలపేట, బెజ్జూర్ మండలాలలోని మారుమూల గ్రామాలకు వెళ్లే ఆర్టీసీ బస్సుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆసిఫాబాద్ డిపో ఆర్టీసీ బస్సులలో తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు.

పెంచికల్పేట్ నుండి సలుగు పల్లి వరకు రోడ్డు గుంతల మయంగా ఉండడంతో ఆర్టీసీ బస్సులు సైతం చెడిపోతున్నాయి. ప్రయాణికులు సైతం ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. బెజ్జూర్ మండల కేంద్రంలో బస్టాండ్ నిర్మాణం కోసం గ్రామ సర్పంచ్ పాలకవర్గం స్థలం కేటాయించి తీర్మానం చేసి ఆర్టీసీ ఆసిఫాబాద్ డిపో మేనేజర్ రాజశేఖర్ కు సమాచారం అందిస్తే వచ్చి స్థలాన్ని పరిశీలించి బస్టాండ్ నిర్మాణం కోసం నివేదిక పంపిస్తారని తెలిపారు. వారి వెంట ఆర్టీసీ సిబ్బంది ఉన్నారు.