calender_icon.png 17 July, 2025 | 12:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పశువులను రోడ్లపై సంచరిస్తే తరలింపు తప్పదు

16-07-2025 11:53:39 PM

మున్సిపల్ కమిషనర్

మణుగూరు,(విజయక్రాంతి): రోడ్ల మీద వాహనదారు లకు అడ్డంకిగా మారిన పశువులపై వాటి యజమానులు బాధ్యత వహించకపోతే కఠిన చర్యలు తప్పవని, మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావు  బుధవారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. వాహన ప్రమాదాలకు కారణమవుతున్న రోడ్లపై సంచరించే పశువులను ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. పశువుల యజమా నులు వాళ్ల ప్రాంగణాలలోనే ఉంచాలన్నారు. రోడ్లపై వదిలితే ఆ పశువులను స్వాధీనం చేసుకుని అపరాధ రుసుము వసూలు చేస్తామని, అవసరమైతే వాటిని గో శాలకు తరలిస్తా మని  కమిషనర్  హెచ్చరించారు. పశు యజమాను లకు గతంలోనే హెచ్చరిక నోటీసులు జారీ చేసి ఉన్నామని, మీడియా మాధ్యమాల ద్వారా ప్రకటించామన్నారు.