18 April, 2026 | 3:55 PM

Breaking News

మైనార్టీ గురుకుల ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలి   •   ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం గుడ్‌న్యూస్‌... DA పెంపు   •   హార్ముజ్ జలసంధి మళ్లీ బంద్‌ — ట్రంప్‌కు దిమ్మతిరిగే షాక్— ఇరాన్ సంచలన ప్రకటన   •   రాత్రి 8:30 గంటలకు జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం   •   మహిళా బిల్లు వీగిపోవడం— బీజేపీ విధానాల ఓటమి   •   దేశ మహిళలకు అన్యాయం.. కాంగ్రెస్, బీజేపీ‎ల‎పై హరీశ్‎రావు కీలక వ్యాఖ్యలు   •   వర్క్ షాప్ కోసం అనుమతి ఇవ్వండి   •   కరీంనగర్ లో విజయక్రాంతి వార్షికోత్సవ వేడుకలు   •   రాఘవపేటలో బడిబాట కార్యక్రమం   •   దళిత క్రిస్టియన్స్ పై సుప్రీంకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలి   •  

సీఎం కేసులు పెడితే.. డిప్యూటీ సీఎం ఎత్తేశారు!

10-04-2025 01:36 AM
  1. కేసీఆర్ తెలంగాణను నిలబెడితే.. రేవంత్‌రెడ్డి పడగొడుతున్నారు
  2. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు 

సంగారెడ్డి, ఏప్రిల్ 9 (విజయక్రాంతి)/పటాన్‌చెరు: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థులపై సీఎం రేవంత్‌రెడ్డి కేసులు పెడితే.. అవితప్పుడు కేసులని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నిరూపించారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మె ల్యే హరీశ్‌రావు అన్నారు.

విద్యార్థుల మీద పెట్టిన కేసులు ఎత్తివేస్తున్నట్లు భట్టి విక్రమార్క ప్రకటించడంతో అవి తప్పుడు కేసులని నిరూపణ అయినట్లేనని చెప్పా రు. బుధవారం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలోని గణేశ్‌గడ్డ దేవా లయంలో ప్రత్యేక పూజల్లో హరీశ్‌రావు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి పాలన చూస్తుంటే తోక కుక్కను ఆడిస్తుందా, కుక్క తోకను ఆడిస్తుందా అర్థం కావడం లేదన్నారు.

అక్రమ కేసులు నమోదు చేయించినందుకు సీఎం భేషరతుగా విద్యార్థులకు క్షమాపణ చెప్పాలన్నారు. కేసీఆర్ చెట్లు పెడితే రేవంత్‌రెడ్డి నరికివేస్తున్నాడని, మొన్న అగ్రికల్చర్ యూనివర్సిటీలో వంద ఎకరాల భూమి తీసుకొని అక్కడ చెట్లను నరికివేయించాడని, నిన్న హెచ్‌సీయులో చెట్లను నరికివేసి మూగ జీవాల ఉసురు పోసుకున్నాడని వాపోయారు.

హైడ్రా అంటూ ఆరు నెలలు పరిగెత్తి చతికిలపడ్డాడని, పేదల ఇండ్లను కూలగొట్టాడని, ఈ దెబ్బకు రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ఈగలు కొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చాడని విమర్శించారు. కేసీఆర్ పాలనలో రియల్ వ్యాపారం పెరిగితే రేవంత్ పాలనలో అథాపాతాళానికి దిగిపోయిందన్నారు. ఏది చూసినా సగంసగం అంతా ఆగమాగమేనన్నారు. 

రేవంత్‌ది చావు భాష

కేసీఆర్ ఎప్పుడు మాట్లాడినా మిషన్ కాకతీయ కింద చెరువులు బాగు చేయాలని, ప్రాజెక్టుల నిర్మాణం చేసి రైతులకు నీళ్లు అందిచాలంటూ సాగు భాష మాట్లాడితే, రేవంత్‌రెడ్డి నరుకుతా, చంపుతా అంటూ చావు భాష మాట్లాడుతున్నాడని విమర్శించారు. కేసీఆర్ తెలంగాణను నిలబెడితే.. రేవంత్‌రెడ్డి పడగొడుతున్నాడని విమర్శించారు. రేవంత్ పాలన వల్ల తెలంగాణ కేవలం 5 శాతం మాత్రమే వృద్ధిరేటు సాధించిందని చెప్పారు. 

ఢిల్లీలో రేవంత్ పని అయిపోయింది

తెలంగాణ పరువును సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టాడని, ఢిల్లీలో కూడా రేవంత్ పని అయిపోయిందని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ఢిల్లీలో బీసీ సభకు రాహుల్‌గాంధీని తీసుకొస్తానని, పార్లమెంట్‌లో బిల్లు ఆమోదింపజేస్తానని చెప్పినా రాహుల్‌గాంధీ ఢిల్లీలో ఉండికూడా రాలేదని తెలిపారు. మరుసటి రోజు రేవంత్‌రెడ్డి లేకుండా పీసీసీ చీఫ్, ఉప ముఖ్యమంత్రితో ఫొటోలు దిగారని హరీశ్‌రావు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ పాల్గొన్నారు.