calender_icon.png 7 February, 2026 | 10:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ ఫెవికాల్ బంధం

07-02-2026 01:47:29 AM

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ప్రజలే బొంద పెడతారు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు

హైదరాబాద్, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి) : బీఆర్‌ఎస్ కాంగ్రెస్ పార్టీది ఫెవి కాల్ బంధమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు విమర్శించారు. కాం గ్రెస్ పార్టీని మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలే బొంద పెట్టడం ఖాయమని పేర్కొన్నారు. సీఎం వ్యాఖ్యలకు కౌంటర్‌గా రాంచందర్ రావు శుక్రవారం ఒక ప్రకటనను విడుదల చేశారు. లిక్కర్ మాఫియాలో కేసీఆర్ కుమా ర్తె కల్వకుంట్ల కవితను అరెస్టు చేసి జైలుకు పంపించిన చరిత్ర భారతీయ జనతా పార్టీదని తెలిపారు.

ఈరోజు టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో ఎందుకు కేసీఆర్ కుటుంబాన్ని కా పాడుతున్నావో తెలంగాణ ప్రజలందరికీ తెలుసని సీఎంను ఉద్దేశించి విమర్శించారు. ఓటుకు నోటు కేసులో నిన్ను కేసీఆర్ కుటుం బం కాపాడినందుకు వారి రుణాన్ని తీర్చుకోవడానికి నేడు వారిన అరెస్టు చేయకపోవ డం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. చేతనైతే సాక్షులుగా పిలవడం కాదు నిందితులు గా పిలిచి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.

నిజామాబాద్ సభలో బడుగు బలహీన వర్గాల ఓట్లు పొందడానికి ఆడుతున్న నాటకాన్ని తెలంగాణ ప్రజలు పూర్తిగా గ్రహిస్తున్నారని తెలిపారు. తాను ఇంకా ఎనిమిది సంవత్సరాలు అధికారంలో ఉంటానని సీఎం కలలు కంటున్నారని విమర్శించారు.  ఆర్‌ఆర్‌ఆర్ అనుమతులు ఎప్పుడొచ్చాయో తెలియకుండా నేను చేశాను అని చెప్పడం సీఎం దివాలా కోరుతున్నానని నిదర్శనమ న్నారు.. కిషన్‌రెడ్డిని కల్వకుంట్ల కిషన్‌రావు అని మాట్లాడడం సీఎం అసహనాన్ని తెలియజేస్తున్నదన్నారు. కేసీఆర్ కుటుంబంలోకి ముఖ్యమంత్రికి వెళ్లాలన్న ఉత్సాహం చాలా ఉన్నట్లుగా కనిపిస్తున్నదని విమర్శించారు.