calender_icon.png 14 January, 2026 | 5:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధిహామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తే ఉద్యమం తప్పదు

14-01-2026 12:00:00 AM

పీసీసీ ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ

బల్మూర్ జనవరి 13: ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించే వరకు కూలీలతో కలిసి దేశవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని పీసీసీ ఉపాధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ హెచ్చరించారు. మంగళవారం బల్మూరు మండలం తుమ్మన్పేట గ్రామంలో రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన జిల్లా చైర్మన్ చత్రు నాయక్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా పీసీసీ ఉపాధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయాలనే కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలను తీవ్రంగా ఖండించారు. గతంలో 90 శాతం వాటా ఉన్న పథకాన్ని 60 శాతానికి తగ్గించాలనే ఉద్దేశంతో కేంద్రం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సురేష్, కాంగ్రెస్ నాయకులు సుధాకర్ గౌడ్, తిరుపతిరావు, నిరంజన్, అనిల్ గౌడ్, రాంప్రసాద్, మాజీ సర్పంచ్ శ్రీనివాసులు పాల్గొన్నారు.