14-01-2026 12:00:00 AM
మున్సిపల్ కమిషనర్ లక్ష్మారెడ్డి
జడ్చర్ల, జనవరి 13: సమిష్టిగా పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉందని మున్సిపల్ కమిషనర్ లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని పదో వార్డులో ప్రత్యేకంగా పారిశుద్ధ పనులను చేపట్టారు. 10 శాతం లాంటోంది సైతం బౌండరీస్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఎవరికివారు వారి ఇంటి చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవలసిన అవసరం ఉందన్నారు. ఎక్కడ ఎలాంటి సమస్యలు ఉన్న మున్సిపాలిటీ వాటిని పరిష్కరించేందుకు సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జ్యోతి కృష్ణారెడ్డి, మున్సిపల్ సిబ్బంది తదితరులు ఉన్నారు.