14-01-2026 12:00:00 AM
ఎంపీ డా. మల్లు రవి, ఎమ్మెల్యే మేఘారెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభి..
వనపర్తి, జనవరి 13 (విజయక్రాంతి): పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణంలో ముంపునకు గురైన కొంకలపల్లి గ్రామ నిర్వాసితులకు నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లురవి , వనపర్తి శాసనసభ్యులు గౌరవ తూడి మేఘారెడ్డి , కలెక్టర్ ఆదర్శ్ సురభి లు ఇండ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని చాంబర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొంకలపల్లి గ్రామానికి చెందిన 35 మంది భూ నిర్వాసితులకు 250 గజాల వైశాల్యం గల ఇంటి స్థలం పట్టాలను అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా వనపర్తి నియోజకవర్గంలోని పలు గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారే తప్ప ప్రాజెక్టు నిర్మాణం ద్వారా కొనపర్తి నియోజకవర్గం అందక పొడవు దురదృష్టకరమన్నారు. కేవలం కమిషన్ల కోసం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి అందినంత దోచుకున్నారే తప్ప భూములు కోల్పోయిన ఆయా గ్రామాల ప్రజల గోడును పట్టించుకోలేదని వారు విమర్శించారు. ఉన్న ఇంటిని కోల్పోయి బ్రతుకుతెరువు చేస్తున్న వ్యవసాయ పొలాలను కోల్పోయి బతుకు దీనంగా ఉన్న ఆయా గ్రామాల ప్రజలు 10 సంవత్సరాలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారన్నారు.
అందులో కొందరు మృత్యువాత పడ్డారని అలాంటి వారిని కూడా పట్టించుకోని గత పాలకులు నేడు ప్రగల్ బాలు పలకడం విడ్డూరమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతన్నలకు నష్టపరిహారం, ఇండ్లు కోల్పోయిన వారికి సైతం ఇంటి స్థానం పట్టాలు అందజేసి ఆదుకుంటుందని వారు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు ఆ గ్రామాల ప్రజలకు అండగా ఉంటామని వారు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాల్ చంద్రయ్య, నాయకులు మాండ్ల కురుమయ్య చరణ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.