రుణమాఫీ చేయకపోతే ప్రభుత్వం తుక్కుతుక్కే
27-06-2024 12:14 AM
బీజేపీ కిసాన్ మోర్చా రాష్ర్ట అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి
హైదరాబాద్, జూన్ 26 (విజయక్రాంతి) : ప్రతి రైతుకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి తీరా ప్రారంభం, ముగింపు అంటూ షరతులు విధించడం రైతులకు వెన్నుపోటు పొడవడమేనని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ర్ట అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు. నాంపల్లి పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశం లో ఆయన మాట్లాడారు. రుణమాఫీ చేయకపోతే రైతులు ప్రభుత్వాన్ని తుక్కుతుక్కు చేస్తారని విమర్శించారు.






