కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
ప్రకటన విడుదల చేసిన శైలజా రామయ్యర్
హైదరాబాద్, జూన్ 26 (విజయక్రాంతి): ఆగస్టు 7న నిర్వహించే జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రదానం చేసే ‘కొండా లక్ష్మణ్ బాపూజీ’ రాష్ట్ర అవార్డుల కోసం చేనేత కళాకారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు రాష్ట్ర చేనేత, జౌళిశాఖ సంచాలకులు శైలజా రామయ్యర్ ప్రకటన విడుదల చేశారు. దరఖాస్తు చేసుకోవాలని అనుకునే వారు 2023 డిసెంబర్ 31 నాటికి 30 సంవత్సరాల వయస్సుతో పాటు 10 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలని పేర్కొన్నారు. చేనేత డిజైనర్లకు 2023 డిసెంబర్ 31 నాటికి 25 సంవత్సరాల వయస్సుతో పాటు 5 సంవత్సరాల అనుభవం ఉండాలన్నారు. జూలై 10లోగా ఆయా జిల్లా చేనేత జౌళి, సహాయ సంచాలకులకు దరఖాస్తులను సమర్పించాలన్నారు. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.






