24 April, 2026 | 9:06 PM

కొలువులను క్రమబద్ధీకరించాలని ధర్నా

27-06-2024 12:13 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 26 (విజయక్రాంతి): రాష్ట్ర వ్యాప్తంగా వివిధ మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న కార్మికుల జీతాలు పెంచాలని, తమ కొలువులను క్రమబద్ధీకరించాలని, జీవో నంబర్ 60, 63ను  అమలు చేయాలని బుధవారం నగరంలో కార్మికులు ధర్నా చేపట్టారు.  జీవో 60 ప్రకారం కార్మికులకు రూ.15,600, రూ.19,600, రూ.22,750 వేతనాలు ఇవ్వాలన్నారు. ఆర్థిక శాఖ ఆ జీవోను అమలు చేయకుండా అందరికీ తక్కువ వేతనాలు ఇస్తోందన్నారు. తప్పిదాన్ని సరిదిద్దకుండా జీవో ఆర్టీ నంబర్ 970ను విడుదల చేయడంతో వేతనాలు తగ్గాయన్నారు. అనంతరం మేడ్చల్ అదనపు కలెక్టర్ విజయేందర్‌రెడ్డికి తమ డిమాండ్లపై వినతిపత్రం అందజేశారు.