12 May, 2026 | 1:23 AM

మక్కలు తరలించకుంటే ఆందోళనే..

12-05-2026 12:13 AM

ఎమ్మెల్యే విజయుడు హెచ్చరిక

ఉండవెల్లి మే 11: కొనుగోలు కేంద్రంలోని ధాన్యాన్ని (మొక్కజొన్న) తరలించకుంటే ధర్నా చేస్తానని ఎమ్మెల్యే విజయుడు హెచ్చరించారు. అలంపూర్ చౌరస్తాలోని మార్కెట్ యార్డును ఆయన సోమవారం సందర్శించి అక్కడి రైతులతో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని తక్షణమే తరలించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. రెండు రోజుల్లో ధాన్యాన్ని తరలించకుంటే.. మూడోరోజు రైతులతో కలిసి ధర్నా చేస్తానని హెచ్చరించారు రైతులు అధైర్యపడొద్దని.. అండగా ఉంటామని హామీ ఇచ్చారు.