calender_icon.png 21 January, 2026 | 2:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అలా చేస్తే అన్ని సినిమాలూ బాగుంటాయ్!

21-01-2026 12:31:18 AM

శర్వానంద్ హీరోగా నటించిన ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రం సంక్రాంతి బరిలో నిలిచి ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను దక్కించుకుంది. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో  అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమాలో సంయుక్త, సాక్షి వైద్య కథానాయికలుగా నటించారు. జనవరి 14న విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సందర్భంగా కథానాయకుడు శర్వా విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలను పంచుకున్నారు. 

సంక్రాంతికి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టడం చాలా హ్యాపీగా ఉంది. ప్రతి సినిమా హిట్ కొట్టాలనే కష్టపడి పనిచేస్తాం. అనుకున్న ఫలితం రావడం చాలా ఆనందాన్నిచ్చింది. -అన్ని సినిమాలు కథ బాగుంటేనే చేస్తాం. అయితే అన్నీ కుదిరినప్పుడే అది వర్క్ అవుట్ అవుతుంది. ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో కలిస్తే బడ్జెట్లు పెరగవు. మంచి సినిమాలు బడ్జెట్‌లో తీయొచ్చు. బాగా తీయాలని కూర్చుంటే ప్రతి సినిమా బాగుంటుంది. 

నాకు ‘జాను’ సినిమా సమయంలో పెద్ద యాక్సిడెంట్ జరిగింది. తర్వాత బరువు పెరిగాను. ‘శ్రీకారం’, ‘ఆడవాళ్లకు జోహార్లు’ సినిమాల్లో కాస్త లావుగా కనిపిస్తా. ఆ లుక్  నాకే నచ్చదు. మనకు మనం నచ్చేలా ఉండాలని వాకింగ్ చేయడం ప్రారంభించా. తర్వాత రన్నింగ్,  స్ట్రెంత్ ట్రైనింగ్, యోగాపై ఫోకస్ చేశా. ‘బైకర్’లో రెండు క్యారెక్టర్లు ఉన్నాయి. అందులో ఒకటి ఫాదర్ రోల్.  దానికోసం చాలా కష్టపడ్డా. అవన్నీ ఈ ట్రాన్స్‌ఫర్మేషన్‌కి ఉపయోగపడ్డాయి. నిజానికి ‘బైకర్’ ముందుగా రావాలి. కొన్ని సాంకేతిక కారణాల వల్ల రాలేదు. 

బాలకృష్ణ టైటిల్ తీసుకున్నాం. ఆయనతోనే లాంచ్ చేయించాం. -అంత గొప్ప సినిమా పేరు పెట్టుకున్నప్పుడు ఆ పేరు నిలబెట్టకపోతే బాగుండదు. ఆయనతో మాట్లాడితే, ఎంతో అభినందించారు. ‘నా పరువు నిలబెట్టావ్ శర్వా’ అన్నారు.

శర్వా సంక్రాంతి త ర్వాత కూడా ఉంటుంది. నెక్స్ ఇయర్ వరకైతే కన్ఫర్మ్ చేశాం. ‘బైకర్’ షూటింగ్ అయిపోయింది. అది మొత్తం ఇండియా గర్వపడే సినిమా అవుతుంది. తెలుగు సినిమా అని కాలర్ ఎగరేసుకొని చెప్పే చిత్రమవుతుంది. సంపత్ నందితో ‘భోగి’ సినిమా షూటింగ్ జరుగుతోంది. అది కూడా చాలా మంచి కథ. ఇక శ్రీను వైట్లతో చేసే సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీ. చాలా అద్భుతమైన కథ కుదిరింది.