21-01-2026 12:32:20 AM
నరేశ్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, ‘రాజు వెడ్స్ రాంబాయి’ ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజాచిత్రం ‘క్రేజీ కళ్యాణం’. భద్రప్ప గాజుల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. యారో సినిమాస్ బ్యానర్‌పై బూసం జగన్‌మోహన్‌రెడ్డి నిర్మిస్తున్నారు. పెళ్లి చుట్టూ తిరిగే పూర్తి వినోదాత్మక చిత్రమిది. తెలంగాణ గ్రామీణ ప్రాంతా ల్లో ఈ సినిమా చిత్రీకరణ జరిపారు.
నరేశ్ వీకే పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం ఈ సినిమా నుంచి ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో ఆయన ‘పర్వతాలు’ అనే పాత్రలో నటిస్తున్నట్టు ప్రకటించారు. సంప్రదాయ వస్త్రధారణలో నరేశ్ లుక్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి సంగీతం: సురేశ్ బొబ్బిలి; డీవోపీ: శ్యామ్ దూపాటి; సాహిత్యం: గోరటి వెంకన్న, కాసర్ల శ్యామ్, చైతన్యప్రసాద్; యాక్షన్: డ్రాగన్ ప్రకాశ్; ఎడిటర్: శ్రావణ్ కటికనేని; ఆర్ట్: సాయి కదిర; స్క్రీన్‌ప్లే: శ్రీనివాస రవీంద్ర; కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: భద్రప్ప గాజుల.