రంగు రంగుల అవతారాలతో వస్తే ప్రజలు నమ్మరు
ప్రజా దర్బార్ లోమంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వ్యాఖ్యలు
ఏదులాపురం,/ ఖమ్మ, మే 13(విజయక్రాంత్రి,) కప్పు శ్తశ్తడబ్బు : పదేళ్ల అధికార దాహంలో పేదవాడిని విస్మరించి, నాడు రైతుల చేతులకు సంకెళ్లు వేసిన వారు.. నేడు రంగు రంగుల అవతారాలతో వస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో జరిగిన ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ క్లస్టర్-1 సమావేశంలో ఆయన ముఖ్యాతిథిగా పాల్గొని ప్రసంగించారు.
నాడు వరి వేస్తే ఉరి.. నేడు కపట కన్నీరు!
ప్రతిపక్షాల తీరును ఎండగడుతూ.. నాడు అధికారంలో ఉండి వరి వేస్తే ఉరి అని రైతులను భయపెట్టిన దొరవారు, నేడు రైతుల కోసం పోరాడుతున్నామంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. దోసెల్లో మొక్కలు పెట్టుకుని, కుండలకు పూతలు పూస్తూ ఫోటోలకు ఫోజులిస్తే ప్రజలు మోసపోరు. మీ పదేళ్ల పాలనలో అధికారులు ఏనాడూ పేదల వద్దకు రాలేదు, కానీ ఈనాడు మేమే స్వయంగా ప్రజల గడప వద్దకు వచ్చి అప్లికేషన్లు తీసుకుంటున్నామని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.
విషం కక్కుతున్న విపక్షాలు..
ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేక ప్రతిపక్షాలు ఒంటి నిండా విషాన్ని నింపుకొని రోడ్ల వెంట విషం కక్కుతున్నాయని మంత్రి మండిపడ్డారు. మూడు నాలుగు సార్లు ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా మీకు జ్ఞానం రాలేదు. కుట్రలు, కుతంత్రాలతో ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చూస్తే మీ కన్న కలలు కలలుగానే మిగిలిపోతాయని బీఆర్‌ఎస్ ను ఉద్దేశించి అన్నారు. ప్రజా దీవెనలు ఉన్నంత వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరూ ఏమీ చేయలేరన్నారు. హెచ్చరించారు.
చేతల్లో చూపిస్తున్నాం..
సోల్లు పురాణం చెప్పే ప్రభుత్వం మాది కాదు.. చేతల ప్రభుత్వం. ఇప్పటికే 73 వేల ఉద్యోగాలు ఇచ్చాం. నిరుద్యోగులకు త్వరలోనే మరిన్ని శుభవార్తలు చెబుతాం. గత ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను కాగితాలకే పరిమితం చేస్తే, మేము ఒక్క రూపాయి అవినీతి లేకుండా 5 లక్షల ఆర్థిక సాయం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో వేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ టి.ఎస్. దివాకర, అడిషనల్ కలెక్టర్ శ్రీజ, మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి, చైర్మన్ పోకబత్తిని అనిత, వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్ , 15 వార్డుల కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.






